కలుగోట్ల (కోయిలకుంట్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలుగోట్ల
—  రెవిన్యూ గ్రామం  —
కలుగోట్ల is located in Andhra Pradesh
కలుగోట్ల
కలుగోట్ల
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°17′02″N 78°20′55″E / 15.283875°N 78.348665°E / 15.283875; 78.348665
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా నంద్యాల
మండలం కోయిలకుంట్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 2,896
 - పురుషుల సంఖ్య 1,522
 - స్త్రీల సంఖ్య 1,374
 - గృహాల సంఖ్య 698
పిన్ కోడ్ 518134
ఎస్.టి.డి కోడ్

కలుగోట్ల, నంద్యాల జిల్లా, కోయిలకుంట్ల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన కోయిలకుంట్ల నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 832 ఇళ్లతో, 3209 జనాభాతో 1269 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1623, ఆడవారి సంఖ్య 1586. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 348 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594500[1].పిన్ కోడ్: 518134.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కోయిలకుంట్ల లోను, ఇంజనీరింగ్ కళాశాల నంద్యాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నంద్యాల లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలు లోనూ ఉన్నాయి.

సిద్దయ్య జన్మస్థలం[మార్చు]

బ్రహ్మంగారి శిష్యుడు సిద్దయ్య గారి జన్మస్థలం ఈ ఊరే .

కాశి నాయన ఆశ్రమం[మార్చు]

కలుగొట్ల.. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల మండలంలోని ఈ పల్లె పేరు వింటేనే అందరి మదిలో మెదిలేది కాశినాయన ఆశ్రమం. ఇక్కడ ఎంతోమంది అన్నార్థుల ఆకలి తీరుస్తూ ఆధ్యాత్మిక భావాలను పంచుతూ సేవలు కొనసాగుతున్నాయి. శ్రీ కాశినాయన ఆశ్రమం కలుగొట్ల కోవెలకుంట్ల- నంద్యాల రహదారి లో కలుగొట్ల గ్రామం లో వుంటుంది. ఇక్కడ శ్రీ కాశినాయన గారు ఈ ఆశ్రమాన్ని 1984 లో కలుగొట్ల గ్రామానికి చెందిన శ్రీ రామచంద్రా రెడ్డి గారిచే గాయత్రీ ఆశ్రమం పేరు మీద స్థాపించారు.అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ నిరంతరాన్నదానం జరుగుతున్నది. నిత్యాన్నదానం అంటే సమయం వుంటుంది , అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి అలాగ. కానీ నిరంతరాన్నదానానికి సమయం ఉండదు. ఎల్ల వేళలా అన్నదానం జరుగుతూనే వుంటుది.అర్ధరాత్రి ఒంటి గంటకు వెళ్ళన అక్కడ భోజనం లభిస్తుంది.ఈ సేవలను అందించేందుకు ప్రతిరోజూ 15 మంది సేవకులు స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తుంటారు

కాశిరెడ్డినాయన ఆశీర్వాదంతో గ్రామంలో 1994లో గాయత్రీదేవి ఆలయాన్ని 24 గంటల్లో నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి ఆధ్యాత్మికత వెల్లివిరియడంతోపాటు ఎంతోమందికి అన్నం పెడుతూ ఆకలి తీర్చేవారు. దీనికి కొంతదూరంలోనే మరో ఆరు ఎకరాల్లో కాశినాయన ఆశ్రమాన్ని 2012లో ఏర్పాటు చేశారు. ఇక్కడ దుర్గేశ్వరి అమ్మవారి ఆలయాన్ని 24 గంటల్లో నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి నిత్యాన్నదానం చేస్తూ ఎంతోమంది ఆకలి తీరుస్తుండటంతో ఆశ్రమ సేవలు విస్తృతంగా మారి ఎంతోపేరు పొందాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆకలితో వచ్చిన వారికి అన్నం లేదనే మాట లేదు. ఉదయం ఫలహారంగా దోశ, ఉప్మా, పూరీ, చిత్రాన్నం, చపాతి, ఇడ్లీ, పొంగలి, ఉగ్గాని బజ్జీ, వడ వంటివి వడ్డిస్తారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అన్నం, పప్పు, రసం, తాళింపు, అప్పడం, పాయసం, పెరుగు, మజ్జిగ ఉంటుంది. ఎంతోమంది ప్రయాణికులు, కూలీలు, స్థానికులు రోజూ వందల సంఖ్యలో వచ్చి భోజనం చేసి ఆకలి తీర్చుకుంటున్నారు. దాహం తీర్చుకునేందుకు శీతల శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేశారు. ఆకుల గంగమ్మవ్వ గుడి చుట్టూ 101 మంది దేవతలను ప్రతిష్ఠించడం ఇక్కడ మరో ప్రత్యేకత. ఏటా డిసెంబరులో కాశినాయన వారోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మూడేళ్ల నుంచి జ్యోతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 50 నుంచి 70 వేలమంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారు.

ఆశ్రమ ప్రాంగణంలో చాలా ఆలయాలను దర్శించవచ్చు. అందులో ప్రముఖమైనవి శ్రీ పంచముఖ గాయత్రీ దేవి,శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి,జోగులాంబ దేవి,నవగ్రహాలు,శ్రీ భవనాశి ఆకుల గంగమ్మ అవ్వ సమాధి, శ్రీ కాళి దుర్గా దేవి, శ్రీ కల్కి మహారాజ్,శ్రీ దద్దనాలేశ్వరుడు (శివాలయం ), శ్రీ కృష్ణ దేవాలయాలను దర్శించవచ్చు .ఇక్కడి శ్రీ రాముడి కళ్యాణ మండపంలో ఎవరైనా ఉచితం గా వివాహాలు చేసుకోవచ్చును.

మార్గశిర పౌర్ణమి రోజున అనగా దత్త జయంతి రోజున శ్రీ కాశినాయన గారి ఆరాధన ను నిర్వహిస్తారు. ఆరోజున చుట్టు పక్కన గ్రామాల మరియు జిల్లాల భక్తులు లక్షలాది మంది హాజరవుతారు.ఆరోజున దాదాపుగా 300 రకాల వంటకాలను వడ్డిస్తారు.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కలుగోట్లలో ఉన్న ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం[మార్చు]

మురుగు నీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగు నీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగు నీటిని నేరుగా జల వనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కలుగోట్లలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కలుగోట్లలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 55 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 195 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 36 హెక్టార్లు
  • బంజరు భూమి: 14 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 967 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 940 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 78 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కలుగోట్లలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • ఇతర వనరుల ద్వారా: 78 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

కలుగోట్లలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

శనగలు, వరి, జొన్నలు

చేతివృత్తులవారి ఉత్పత్తులు[మార్చు]

లోహపు వస్తువులు

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,896. ఇందులో పురుషుల సంఖ్య 1,522, స్త్రీల సంఖ్య 1,374, గ్రామంలో నివాస గృహాలు 698 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]