Jump to content

కల్కి సదాశివం

వికీపీడియా నుండి
త్యాగరాజన్ సదాశివం
టి.సదాశివం , ఎం.ఎస్.సుబ్బులక్ష్మీల వివాహ చిత్రం, 1940
జననం(1902-09-04)1902 సెప్టెంబరు 4
అంగరై, తిరుచినాపల్లి జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, ఇండియా.
మరణం1997 నవంబరు 22(1997-11-22) (వయసు 95)
వృత్తిరచయిత, జర్నలిస్ట్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాయకుడు, సినిమా నిర్మాత.
జీవిత భాగస్వామిఅచిత కుచంబల్;(m.1928-1938)
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి
(m. 1940-1997; మరణం వరకు)
బంధువులురాధా విశ్వనాథన్ (కుమార్తె), విజయ రాజేంద్రన్
1945

"కల్కి" త్యాగరాజ సదాశివం (తమిళం: "கல்கி" தியாகராஜன் சதாசிவம்) (1902 సెప్టెంబరు 4 – 1997 నవంబరు 2 [1]) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాయకుడు, జర్నలిస్టు, నినిమా నిర్మాత. అతడు కల్కి కృష్ణమూర్తితో పాటు "కల్కి" అనే తమిళ పత్రిక వ్యవస్థాపకులలో ఒకడు. అతడు ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి భర్త.

జీవితం

[మార్చు]

అతడు 1902 సెప్టెంబరు 4 న తిరుచిరాపల్లి జిల్లాలోని ఆంగరైలో జన్మించాడు. త్యాగరాజణ్, మంగాళం అయ్యర్ దంపతులకు గల 16 మంది సంతానంలో మూడవవాడు. లాలాలజపతి రాయ్, బిపిన్ చంద్ర పాల్, లోకమాన్య తిలక్, శ్రీ అరబిందో ఘోష్ ల రచనల, ఉపన్యాసాలకు ప్రభావితుడైనాడు. కల్కి సదాశివం భారత స్వాతంత్ర్యోద్యమలో చిన్న వయస్సులో చేరాడు. అతడు సుబ్రహ్మణ్య శివ శిష్యునిగా ఒక ఆంగ్లేయుని చంపాలనుకున్నాడు. దానికి జైలు శిక్ష అనుభవించాడు. దీని ఫలితంగా పాఠశాల విద్యకు దూరమయ్యాడు. భరత సమాజ్ లో చేరాడు. కుష్టు రోగంతో బాధపడుతూ స్వదేశీ ఉద్యమంలో పాల్గొంటున్న సుబ్రహ్మణ్య శివకు సహాయాన్నందించాడు.[2] రాజగోపాలాచారి, మహాత్మా గాంధీ ల ఉపన్యాసాలకు ప్రభావితుడై అహింసా ఉద్యమంలో పాల్గొన్నాడు. అతడికి

మొదటి భార్య అపితకుచంబల్ వల్ల రాధా, విజయ అనే ఇద్దరు కుమార్తెలు కలరు. మొదటి భార్య 1933 లో మరణించింది. 1936 జూలైలో తన సైద్ధాంతిక, రాజకీయ అభిప్రాయాలకు గౌరవిస్తున్న ఎం.ఎస్.సుబ్బలక్ష్మిని కలిసాడు. వారు 1940 జూలై 10 న వివాహం చేసుకున్నారు. అతని కుమార్తె రాధా ప్రసిద్ధ సంగీత కారిణిగా గుర్తింపు పొందింది.

అతడు ప్రముఖ జర్నలిస్టు, రచయిత కల్కి కృష్ణమూర్తితో సన్నిహితంగా ఉండేవాడు. అతడు 1940లో ప్రారంభింపబడిన "కల్కి" పత్రికకు సహ వ్యవస్థాపకులు.

మూలాలు

[మార్చు]