కల్లు కాంపౌండ్ 1995
| కల్లు కాంపౌండ్ 1995 | |
|---|---|
| దర్శకత్వం | ప్రవీణ్ జెట్టి |
| కథ | ప్రవీణ్ జెట్టి |
| నిర్మాత | బుర్రా మల్లేష్ గౌడ్ హారిక జెట్టి పిట్ల విజయలక్ష్మీ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | ఆరె సందీప్ |
| సంగీతం | సాయిశ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | బ్లూ హారీజోన్ మూవీ ప్యాక్టరీ |
విడుదల తేదీ | 18 అక్టోబర్ 2024 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
కల్లు కాంపౌండ్ 1995 2024లో విడుదలైన తెలుగు సినిమా. బ్లూ హారీజోన్ మూవీ ప్యాక్టరీ బ్యానర్‌పై బుర్రా మల్లేష్ గౌడ్, హారిక జెట్టి, పిట్ల విజయలక్ష్మీ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ జెట్టి దర్శకత్వం వహించాడు..[1] గణేష్, ఆయూషి పటేల్, పోసాని కృష్ణమురళి, జీవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 12న విడుదల చేసి,[2] సినిమాను అక్టోబర్ 18న విడుదల చేశారు.
కథ
[మార్చు]ఉన్నత విద్యావంతుడైన రాజు (గణేష్) తన గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) కల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు.ఈ క్రమంలో రాజుకు ఎదురైనా ఇబ్బందులు ఏమిటి ? ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- గణేష్
- ఆయూషి పటేల్
- పోసాని కృష్ణ మురళి
- జీవా
- ప్రవీణ్
- గౌతంరాజు
- ప్రవీణ్ జెట్టి
- సునీత మనోహర్
- జబర్దస్త్ అప్పా రావు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బ్లూ హారీజోన్ మూవీ ప్యాక్టరీ
- నిర్మాత: బుర్రా మల్లేష్ గౌడ్, హారిక జెట్టి, పిట్ల విజయలక్ష్మీ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ జెట్టి
- సంగీతం: సాయిశ్రీనివాస్
- సినిమాటోగ్రఫీ: ఆరె సందీప్
మూలాలు
[మార్చు]- ↑ "కల్లు కాంపౌండ్.. 1995లో జరిగిన కథ". NT News. 13 April 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
- ↑ "యధార్థ సంఘటన ఆధారంగా.. 'కల్లు కాంపౌండ్ 1995'! ట్రైలర్ విడుదల". Chitrajyothy. 12 April 2024. Retrieved 9 July 2025.