కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా
జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా | |||
చైర్ పర్సన్, లోకాయుక్తా, సిక్కిం
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 18 మే 2015 | |||
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 21 మే 2013 – 6 మే 2015 | |||
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 17 జూలై 1997 – 18 నవంబరు 2012 | |||
ఉత్తరాఖాండ్ హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 18 నవంబరు 2012 – 20 మే 2013 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 7 మే 1953 బైద్యాపూర్, తెన్యా, ముర్షిదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం |
కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా (జ. 7 మే 1953) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హైదరాబాదులోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా పనిచేశాడు.[1] 2013, మే 21వ తేది నుండి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు.[2]
జననం
[మార్చు]కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా 1953, మే 7న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ముర్షిదాబాద్ జిల్లాలోని బైద్యాపూర్ గ్రామంలో జన్మించాడు.
వృత్తి జీవితం
[మార్చు]కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా 1981, ఏప్రిల్ 21న న్యాయవాదిగా చేరి సివిల్, కాన్స్టిట్యూషనల్, క్రిమినల్ విషయాలు, మధ్యవర్తిత్వ విషయాలలో కలకత్తా హైకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. అటు తరువాత 1997లో కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[3] కొంతకాలం కలకత్తా హైకోర్టులో యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశాడు.[4] 2012-2013 మధ్యకాలంలో ఉత్తరాఖాండ్ హైకోర్టు న్యాయమూర్తిగా, 2013-2015 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. 2015 మే 18న సిక్కిం రాష్ట్ర లోకాయుక్త చైర్ పర్సన్ గా నియమించబడ్డాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "KJSGJ". tshc.gov.in. Retrieved 2021-06-16.
- ↑ http://hc.tap.nic.in/aphc/kjsgj.html
- ↑ "Calcutta High Court - Judges". www.calcuttahighcourt.gov.in. Retrieved 2021-06-16.
- ↑ "Justice Kalyan Jyoti Sengupta is new Chief Justice of the AP high court". Times of India. 18 May 2013. Retrieved 16 June 2021.
- ↑ "Justice Kalyan Jyoti Sengupta sworn-in as Sikkim Lokayukta Chairperson". The Economic Times. Retrieved 2021-06-16.