కవిత కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కవిత కృష్ణమూర్తి
ఇతర పేర్లు కవితా సుబ్బరామన్
వృత్తి ప్లే బ్యాక్ గాయకురాలు
క్రియాశీలక సంవత్సరాలు 1971–ప్రస్తుతం

కవిత కృష్ణమూర్తి , ఒక భారతీయ ప్లేబ్యాక్ శాస్త్రీయ గాయకురాలు. హిందీ, బెంగాలీ, కన్నడ, రాజస్థానీ, భోజ్‌పురి, తెలుగు, ఒడియా, మరాఠీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, మలయాళం, గుజరాతీ, నేపాలీ, అస్సామీ, కొంకణి, పంజాబీ భాషలలో కవిత కృష్ణమూర్తి పాటలు పాడింది. [1] [2] ఆమె నాలుగు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులు గెలుచుకుంది. 2005లో కవిత కృష్ణమూర్తి పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది . 1999లో, ఆమె ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎల్. సుబ్రమణ్యంను వివాహం చేసుకుంది బెంగళూరులో నివసిస్తోంది.

బాల్యం

[మార్చు]

కవిత కృష్ణమూర్తి శారద కృష్ణమూర్తి దంపతులకు జన్మించారు. కవిత కృష్ణమూర్తి తన అత్త ప్రోతిమా భట్టాచార్య ప్రోత్సాహంతో కవితా కృష్ణమూర్తి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆమె శాస్త్రీయ గాయకుడు బలరామ్ పూరి మార్గదర్శకత్వంలో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోనేర్చుకోవడం మొదలుపెట్టింది. ఎనిమిదేళ్ల వయసులో కవిత కృష్ణమూర్తి సంగీత పోటీలో బంగారు పతకం సాధించింది. కవిత కృష్ణమూర్తి 1960ల మధ్యలో న్యూ ఢిల్లీలో జరిగిన ఇంటర్-మినిస్ట్రీ క్లాసికల్ పోటీలో పాల్గొని అనేక పతకాలను గెలుచుకుంది.

కెరీర్

[మార్చు]
2008లో ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన పంచకన్య బెంగాలీ కవితా కార్యక్రమంలో కవితా కృష్ణమూర్తి.

ఆమె కళాశాల రోజుల్లో, సంగీత స్వరకర్త గాయకుడు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో లతా మంగేష్కర్ సహ గాయనిగా 1971లో బెంగాలీ చిత్రం శ్రీమాన్ పృథ్వీరాజ్‌లో ఒక పాట ను పాడే అవకాశం లభించింది. 14 సంవత్సరాల వయసులో కవిత కృష్ణమూర్తిగారు సినిమాలలో పాటలు పాడటానికి ముంబై వెళ్ళింది.

కాదంబరి (1976)లో విలాయత్ ఖాన్ స్వరకల్పనలో ఆమె తన మొదటి పాటను పాడింది. ఈ పాట ఆయేగా ఆనేవాలా ( లతా మంగేష్కర్ పాడిన మహల్ (1949) సూపర్‌హిట్ పాట యొక్క రీమేక్) షబానా అజ్మీపై చిత్రీకరించబడింది. [3]

మూలాలు

[మార్చు]
  1. "लता संग 9 साल की उम्र में गाया गाना, ऐसे संवरा कविता कृष्णमूर्ति का करियर". Aaj Tak (in హిందీ). 25 January 2020. Archived from the original on 14 January 2022. Retrieved 14 January 2022.
  2. Priyanka Dasgupta (19 December 2009). "Kavita Krishnamurthy conquering global shores". The Times of India. Archived from the original on 29 September 2011. Retrieved 27 January 2010.
  3. "Kadambari (1976)". Archived from the original on 28 January 2021. Retrieved 19 December 2020.