కవిసామ్రాట్ (2022 సినిమా)
Jump to navigation
Jump to search
కవిసామ్రాట్ (2022 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సవిత్ సి చంద్ర |
---|---|
నిర్మాణం | ఎల్బీ శ్రీరాం భట్ల |
రచన | సవిత్ సి చంద్ర |
తారాగణం | ఎల్బీ శ్రీరాం అనంత బాబు రాజ్ కందుకూరి రామజోగయ్య శాస్త్రి సన్నీ అఖిల్ |
సంగీతం | డా. జోస్యభట్ల |
విడుదల తేదీ | అక్టోబర్ 22, 2022 |
నిడివి | 77 నిమిషాలు |
భాష | తెలుగు |
కవిసామ్రాట్ అనేది ఐదు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఏలిన ప్రముఖ తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ జీవితచరిత్రను తెలిపే, 2022లో విడుదలైన సినిమా. దీనిలో ఎల్బీ శ్రీరాం కథానాయకుడుగా నటించాడు.[1]
కథ
[మార్చు]ఈ సినిమా కథ విశ్వనాథకి కవిత్వంపై ఉన్న మక్కువతో మొదలవుతుంది. ఆయన 'రామాయణ కల్పవృక్షం' పుస్తకం చదువుతున్న వారసుని మదిలో మెదిలేలా విశ్వనాథ జీవిత విశేషాలను చెబుతూ కథ నడిపారు. విశ్వనాథ సత్యనారాయణ పాత్ర 'శ్రీహరి స్తోత్రం', 'జగజ్జాల పాలం'.. అంటూ పరిచయం అవుతుంది. తన మాతృభాష ఏమైపోతుందో అన్న ఆవేదన వ్యక్తం చేస్తూ విశ్వనాథ రాస్తూ ఉండగా సినిమా ముగుస్తుంది.[2]
ఆకట్టుకునే అంశాలు
[మార్చు]ఎల్బీ శ్రీరామ్ అభినయం, సాహితీ మేరునగం కథ కావడం, అలరించే సంభాషణలు, సాహితీ ప్రియులకు నచ్చే అంశాలు ఉండటం అనేవి ఈ సినిమాలో ఆకట్టుకునే విషయాలు.[3]
చిత్రబృందం
[మార్చు]- దర్శకుడు- సవిత్ సి చంద్ర
- నిర్మాత- ఎల్బీ శ్రీరాం భట్ల
- సంగీతం- డా. జోస్యభట్ల
- నటులు- ఎల్బీ శ్రీరాం, అనంత బాబు, రాజ్ కందుకూరి, రామజోగయ్య శాస్త్రి, సన్నీ అఖిల్
మూలాలు
[మార్చు]- ↑ Telugu, ntv (2022-10-22). "Kavi Samrat Review: కవిసమ్రాట్ రివ్యూ (ఆహాలో)". NTV Telugu. Retrieved 2022-11-02.
- ↑ Telugu, TV9 (2022-10-22). "Kavi Samrat - Aha: ఆహాలో 'కవిసామ్రాట్' స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే.. ప్రేక్షకుల ముందుకు గొప్ప రచయిత జీవిత చరిత్ర." TV9 Telugu. Retrieved 2022-11-02.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telugu, ntv (2022-10-22). "Kavi Samrat Review: కవిసమ్రాట్ రివ్యూ (ఆహాలో)". NTV Telugu. Retrieved 2022-11-02.