కాంచీపురం పట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంచీపురం పట్టు
రకం Sari
మెటీరియల్ Silk

కాంచీపురం పట్టు తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో నేయబడుతున్న బహు ప్రజాదరణ గల పట్టు చీర. కాంచీపురం పట్టణం అక్కడ తయారయ్యే పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.[1] దీనిని కంజీవరం చీర అని కూడా పిలుస్తారు.[2]

విశేషాలు[మార్చు]

చీరంటేనే భారతీయత. ఆ భారతీయతకు మరింత భారీ ప్రచారం కల్పించింది కంచిపట్టే. పట్టు పురుగుల నుంచి తీసే సహజసిద్ధమైన పట్టుకు, బంగారు జరీ కలిపి చేతులతో మగ్గంపై నేస్తారు. పట్టు చీరంటే కాంచీపురం పట్టు మాత్రమే అన్నంత పేరుంది. కంచిలో తయారయ్యే చీరలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. ఆరు మీటర్ల పొడవు.. 800 గ్రాముల నుంచి కిలో బరువు కంచి పట్టు చీర సొంతం. కంచిపట్టు చీరకు శతాబ్ధాల చరిత్ర ఉంది. చెన్నైకి 82 కిలోమీటర్ల దూరంలో ఉండే కాంచీపురం.. పట్టు చీరల పుట్టిల్లు. స్వచ్ఛమైన పట్టు, జరీ మిశ్రమంతో నిండైన చీర రూపొందించడం ఇక్కడి కళాకారులకు మగ్గంతో పెట్టిన విద్య. కర్ణాటక నుంచి తెప్పించిన పట్టు కండీకి, సూరత్ బంగారపు జరీని కలిపి కళాకారులు చీర తయారు చేస్తారు. చీర, పైట అంచులను విడివిడిగా నేసి మూడింటే కలిపే సంప్రదాయం కంచీపురం పట్టు నేతకళాకారులది. ప్రకృతి వర్ణాలను సంమిళితం చేసి నేస్తారు. మొదట సారి కట్టినప్పుడు గరుకుగా.. తర్వాత మెత్తదనం ఆపాదించుకుంటుంది కంచిపట్టు చీర. చలికాలంలో వెచ్చగా.. వేసవిలో చల్లటి అనుభూతినివ్వడం కంచిపట్టు చీర మరో ప్రత్యేకత.[3]

చారలు, చెక్స్, టెంపుల్ బోర్డర్లతో పాటు పూల బుటాలతో ఎక్కువగా వచ్చేవి కంచిపట్టు చీరలు. కాంచీపురం దగ్గర్లోని వేగావతీ నది నీళ్లతో రంగులద్దుతారు. ఈ నీటికెంతటి ప్రాధన్యత ఉందంటే.. కంచి పట్టు చీరలకంత ప్రఖ్యాతి రావడానికి కారణం ఈ నీళ్లేనని భావించేంత[4].

ఒకప్పుడు ఐదారు రంగుల్లో మాత్రమే లంభించే కంచిపట్టు.. ఇప్పుడు 50 రంగుల్లో దొరుకుతోంది. ఫ్యాషన్ డామినేట్ చేస్తుండటంతో హాఫ్ జరీ చీరలు నేయడం మొదలైంది. అంతే కాదు వన్ గ్రామ్ బంగారం చీరలు కూడా నేస్తున్నారు.

పురాణ గాథ[మార్చు]

హిందూ పురాణాల ప్రకారం కంచి పట్టు చీర నేసిన నేతకారులు "మార్కండ మహాముని" సంతతికి చెందినవారు. మార్కండ మహాముని దేవతలకు వస్త్రాలను కమలం యొక్క దారంతో నేసినవారని చారిత్రక కథనం. మరియు ప్రత్తి వస్త్రాలు శివునికి యిష్టమైనవి. పట్టు వస్త్రాలు విష్ణువుకు ప్రీతిపాత్రమైనవి.[5]

కాంచీపురం కృష్ణదేవరాయల కాలం నుండి ప్రఖ్యాతి పొందింది. అప్పుడు రెండు చేనేత కులాలుండేవి. అవి దేవాంగ మరియు సాలెవాళ్ళు. ప్రస్తుతం ఈ కులాల కుటుంబాలు కాంచీపురం చుట్టు ప్రక్కల ఉన్నారు. వారు ఈ పట్టు చీరల పనిని వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు.[6]

నేసే పద్ధతి[మార్చు]

కాంచీపురం చీరలు శుద్ధమైన మల్బరీ పట్టుతో నేయబడతాయి. ఈ పరిశ్రమ చేనేత పరివారు నడుపుతున్నారు.[6] శుద్ధమైన మల్బరీ పట్టును ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి, జరీని గుజరాత్ రాష్ట్రం నుండి తెప్పిస్తారు. చీర నేయడం మాత్రం కాంచీపురంలో జరుగుతుంది.[7] ఈ చీర నేయడానికి షటిల్ ను ఉపయోగిస్తారు. నేతపనివాడు కుడివైపు పనిచేస్తే ఎదమవైపు షటిల్ పనిచేస్తుంది. చీర అంచు యొక్క రంగు మరియు డిజైన్ లు చీర మధ్యభాగం కంటే భిన్నంగా ఉంటుంది. చీర పైటంచు వైవిధ్యంగా నేస్తారు. మొదట విడిగా నేసి తరువాత దానిని చీరకు కలిపేవారు.[8] చేర మరియు పైటంచు కలిసే చోటను జిగ్ జాగ్ లైన్ అంటారు.[4]

కచ్చితమైన కాంచీపురం పట్టు చీరకు చీర మరియు దాని అందు విడి విడిగా నేసి దానిని కలుపుతారు. దానిని కలిపే మధ్యభాగం విడిపోకుండా బలంగా అతుకుతారు.[9]

పేటెంట్ హక్కు[మార్చు]

కంచి పట్టు చీరలకు పేటెంట్ హక్కులు కల్పిస్తూ జియోగ్రాఫికల్ సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ చీరలను వంశపారంపర్యంగా నేస్తున్న వారికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ 1999 చట్టం ప్రకారం పేటెంట్ హక్కులను కల్పించారు. ఈ గుర్తింపు 2005 నుండి వచ్చింది.[10][11]

నేసే శైలులు[మార్చు]

సూర్యుడు, చండ్రుడు, రథాలు, నెమళ్ళు, చిలుకలు, హంసలు, సింహాలు, నాణెములు, మామిది పడ్డు, ఆకులు మరియు అనేక కళాత్మక నమూనాలతో నేస్తారు. సాధారణ కళాత్మక శైలులలో మల్లెమొగ్గలు ఒక చతురస్రాకార లేదా వృత్తాకార చట్రం మధ్యలో ఉండేటట్లు నేస్తారు. ఈ చీరను స్థానికంగా "మల్లినాగ్గు" అని పిలుస్తారు. మరియొక శైలి చీర అంతా సమాంతర రేఖలు విస్తరించబడి ఉంటాయి.[4]

ఈ విధమైన ఆకర్షణీయంగా నేసిన "పల్లు" చీరలు రాజా రవి వర్మ గీసిన చిత్రాలలోనూ మరియు మహాభారత, రామాయణ గాథల చిత్రాలలోనూ కనిపిస్తాయి.[12]

గుర్తింపు[మార్చు]

కాంచీపురం చీరలు పట్టు మరియు బంగారు దారాలతో ప్రత్యేకంగా నేయబది అనేక శుభకార్యాలలోనూ, పండగలలోనూ ఉపయోగిస్తారు.[13]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]