Jump to content

కాకతీయ సంచిక

వికీపీడియా నుండి

కాకతీయుల చరిత్రను సప్రమాణికంగా తెలుగువారికి అందించే ఉద్దేశంతో ఆంధ్రేతిహాస పరిశోధక మండలి వారు ప్రచురించిన ప్రత్యేక సంచిక ఇది. ప్రముఖ చరిత్రకారులు మారేమండ రామారావు ఈ సంచికకు సంపాదకత్వం వహించారు.[1]

రచన నేపథ్యం

[మార్చు]

కాకతీయ సంచికను మారేమండ రామారావు సంపాదకత్వంలో 1935లో ప్రచురించారు. తెలుగు సాహిత్యంలో, చరిత్రరంగంలో సుప్రఖ్యాతి పొందిన ఆంధ్రేతిహాస పరిశోధక మండలి వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. సంపాదకమండలిలో రాళ్లబండి సుబ్బారావు, మారేమండ రామారావు, చిర్రావూరు ఆత్మారాం, టేకుమళ్ళ అచ్యుతరావు ఉన్నారు.

విషయాలు

[మార్చు]

కాకతీయ సామ్రాజ్యం గురించిన పలు విశేషాలు వివరాలు చారిత్రిక ప్రమాణ బుద్ధితో రచించి ఈ సంచికగా ప్రచురణ చేశారు. ఎన్నో శాసన, వాఙ్మయ ఆధారాలతో కాకతీయుల పాలన మొదలుకొని సాహిత్యం, ప్రజాజీవనం వరకూ ఎన్నో అంశాలపై 30 వ్యాసాలతో దీన్ని ముద్రించారు. చిత్రపటాలు, మాప్‌లతో కూడిన ఈ పుస్తకంలోని వ్యాసాలు పలువురు చారిత్రికులు రచించారు.[2]

వ్యాసాలు

[మార్చు]

కాకతీయ సంచికలో ఈ క్రింది వ్యాసాలు ఉన్నాయి:

  • కాకతీయుల చరిత్రము
  • కాకతీయ రాజధాని ప్రశంస
  • కాకతీయ రాజుల విజయ బిరుదప్రశస్తి
  • ప్రతాపరుద్రుని కాలపు మఖ్తావనరు
  • హనుమకొండ స్థానిక చరిత్ర
  • విద్యానాథుని కాకతీయాన్వయ నిరూపణము
  • కాకతీయ సామ్రాజ్యాంధ్ర వాఙ్మయము
  • కాకతీయ ప్రోలరాజాదుల ప్రశంస
  • కాకతీయుల నాటి సాంఘిక చరిత్ర
  • ప్రతాపరుద్ర ప్రశస్తి, ప్రతాపరుద్రునిపై మహమ్మదీయుల దండయాత్ర
  • కాకతీయుల ఆంధ్రభాషా సేవ
  • కాకతీయ ప్రశంసా పంచరత్నములు
  • కాకతీయుల రెడ్లు
  • కాకతీయ రాజ్యము భౌతిక స్వరూపము
  • కాకతీయులు - కళింగము
  • రుద్రమ్మ
  • కాకతీయ వంశము
  • ప్రతాపరుద్రీయము
  • ఓరుగల్లు చరిత్ర
  • పాలుకురికి సోమనాథకవి
  • కాకతీయనాణెములు
  • కాకతీయుల - ద్రవిడ వాఙ్మయము
  • గణపతి దేవ ప్రశంస
  • కాకతీయుల నాటి సాంఘిక చరిత్ర
  • వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామము
  • ప్రతాపచరిత్రము
  • కాకతీయుల చరిత్రము-విశేషాంశములు
  • గద్వాల సంస్థానము
  • కాకతీయ వర్ధంత్యుత్సవములు

వ్యాసకర్తలు

[మార్చు]

ఈ వ్యాసాలను పలువురు చరిత్రకారులు వ్రాశారు. వారి జాబితా ఇది:

మూలాలు

[మార్చు]
  1. "Journal of the Andhra Historical Research Society > Volume IX, Issue 3, 1935 > Publications of the Andhra Historical Research Society. Kakatiya Sanchika in (Telugu)". Archived from the original on 2015-10-11. Retrieved 2015-08-08.
  2. ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల