Jump to content

కాటసాని రామిరెడ్డి

వికీపీడియా నుండి
కాటసాని రామిరెడ్డి
కాటసాని రామిరెడ్డి

పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
నియోజకవర్గం బనగానపల్లె

వ్యక్తిగత వివరాలు

జననం 18 ఆగష్టు 1968
గుండ్ల శింగవరం, అవుకు మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు కాటసాని ఓబులమ్మ, ఓబులరెడ్డి
జీవిత భాగస్వామి జయమ్మ
సంతానం   ఓబుల్‌రెడ్డి, నాగార్జునరెడ్డి (లేట్), ప్రతిభ, ప్రణతి
నివాసం బనగానపల్లి
పూర్వ విద్యార్థి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

కాటసాని రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో బనగానపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కాటసాని రామిరెడ్డి 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, అవుకు మండలం , గుండ్ల శింగవరం గ్రామంలో కాటసాని ఓబులమ్మ, ఓబులరెడ్డి దంపతులకు జన్మించాడు. ఆయన శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కాటసాని రామిరెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1987లో అవుకు మండలం మెట్టుపల్లె సింగిల్‌ విండో అధ్యక్షుడిగా, 1988–93 వరకు గుండ్ల శింగవరం సర్పంచ్‌గా, అవుకు మండల ఉపాధ్యక్షుడిగా, 1994–98 వరకు బనగానపల్లె మండల జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేసి, 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ లో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం నుండి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా రామకృష్ణారెడ్డి పై 13,686 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో కాంగ్రెస్ పార్టీ లో చేరి 26 ఆగష్టు 2013న రాజీనామా చేశాడు.[2] ఆయన 4 సెప్టెంబర్ 2013న వైఎస్సార్సీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.[3]

కాటసాని రామిరెడ్డి 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్ధన రెడ్డి చేతిలో 17341 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.కాటసాని రామిరెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్ధన రెడ్డి పై 13,384 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.
  2. Sakshi (26 August 2013). "కాంగ్రెస్ పార్టీకి కాటసాని రాజీనామా". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.
  3. Sakshi (4 September 2013). "వైఎస్సార్‌సీపీలోకి ఎమ్మెల్యే కాటసాని". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.
  4. Sakshi (2019). "Banaganapalle Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.