చల్లా రామకృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చల్లా రామకృష్ణారెడ్డి

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 1 జనవరి 2021

మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 27 ఆగస్టు 1948
ఉప్పలపాడు, అవుకు మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 1 జనవరి 2021
హైదరాబాద్
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు చిన్నపురెడ్డి, నారాయణమ్మ
జీవిత భాగస్వామి శ్రీదేవి
సంతానం చల్లా విఘ్నేశ్వరరెడ్డి, చల్లా భగీరథరెడ్డి , బృంద, పృథ్వీ [1]

చల్లా రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, దివంగత ఎమ్మెల్సీ.

జననం, విద్యాభాస్యం[మార్చు]

చల్లా రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, అవుకు మండలం, ఉప్పలపాడు గ్రామంలో 1948 ఆగస్టు 27లో చిన్నపురెడ్డి, నారాయణమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తిరుపతిలో 1969లో అగ్రికల్చర్ బీఎస్సీతో పూర్తి చేసి, 2002లో మైసూర్ యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

చల్లా రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునగాల బలరామిరెడ్డి పై 29168 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టాడు. ఆయన 1989లో జరిగిన ఎన్నికల్లో డోన్‌ నియోజకవర్గం, 1991లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. చల్లా రామకృష్ణారెడ్డి 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1994లో జరిగిన ఎన్నికల్లో కోవెలకుంట్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కర్రా సుబ్బారెడ్డి చేతిలో 1702 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.

చల్లా రామకృష్ణారెడ్డి 1999లో జరిగిన ఎన్నికల్లో కోవెలకుంట్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కర్రా సుబ్బారెడ్డి పై 21085 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఆయన 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యర్రబోతుల వెంకట రెడ్డి పై 3103 ఓట్ల గెలిచాడు.2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల నుండి నూతనంగా ఏర్పడిన బనగానపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో 13686 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.ఆయన 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశాడు. చల్లా రామకృష్ణా రెడ్డి హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో 2019 మార్చి 8న వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3][4]

చల్లా రామకృష్ణారెడ్డిని 2019 ఆగస్టు 12న వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశాడు.[5][6] ఆయన శాసనమండలిలో ఎమ్మెల్సీగా 2019 సెప్టెంబరు 11న ప్రమాణ స్వీకారం చేశాడు.[7]

మరణం[మార్చు]

చల్లా రామకృష్ణారెడ్డి కరోనా బారిన పడి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 జనవరి 1న మరణించాడు.[8][9] ఆయన అంత్యక్రియలు 2021 జనవరి 2న ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన ఫార్మ్‌ హౌస్‌లో జరిగాయి.[10]

మూలాలు[మార్చు]

  1. Sakshi (12 August 2019). "వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  2. Sakshi (2 January 2021). "కోవెలకుంట్లపై 'చల్లా' ముద్ర". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  3. TV9 Telugu (8 March 2019). "వైసీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి -". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Hindu (9 March 2019). "Challa joins YSRCP" (in Indian English). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  5. Sakshi (12 August 2019). "ఎమ్మెల్సీగా చల్లా రామకృష్ణారెడ్డి." Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  6. Sakshi (15 August 2019). "రేనాటిగడ్డకు అరుదైన అవకాశం". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  7. Sakshi (11 September 2019). "వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Sakshi. Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  8. EENADU (1 January 2021). "చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  9. The News Minute (1 January 2021). "Andhra MLC Challa Ramakrishna Reddy of YSRCP succumbs to COVID-19" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  10. Prajasakti (2 January 2021). "అశ్రునయనాల మధ్య". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.