కాడ్మియం క్లోరైడ్
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Cadmium dichloride
| |||
ఇతర పేర్లు
Cadmium(II) chloride
| |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [10108-64-2] | ||
పబ్ కెమ్ | 24947 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 233-296-7 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:35456 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | EV0175000 | ||
SMILES | [Cd+2].[Cl-].[Cl-] | ||
| |||
ధర్మములు | |||
CdCl2 | |||
మోలార్ ద్రవ్యరాశి | 183.31 g·mol−1 | ||
స్వరూపం | White solid, hygroscopic | ||
వాసన | Odorless | ||
సాంద్రత | 4.047 g/cm3 (anhydrous)[1] 3.327 g/cm3 (pentahydrate)[2] | ||
ద్రవీభవన స్థానం | 568 °C (1,054 °F; 841 K) at 760 mmHg[2] | ||
బాష్పీభవన స్థానం | 964 °C (1,767 °F; 1,237 K) at 760 mmHg[2] | ||
Hemipentahydrate: 79.5 g/100 mL (−10 °C) 90 g/100 mL (0 °C) Monohydrate: 119.6 g/100 mL (25 °C)[2] 134.3 g/100 mL (40 °C) 134.2 g/100 mL (60 °C) 147 g/100 mL (100 °C)[3] | |||
ద్రావణీయత | Soluble in alcohol, selenium(IV) oxychloride, benzonitrile Insoluble in ether, acetone[1] | ||
ద్రావణీయత in pyridine | 4.6 g/kg (0 °C) 7.9 g/kg (4 °C) 8.1 g/kg (15 °C) 6.7 g/kg (30 °C) 5 g/kg (100 °C)[1] | ||
ద్రావణీయత in ethanol | 1.3 g/100 g (10 °C) 1.48 g/100 g (20 °C) 1.91 g/100 g (40 °C) 2.53 g/100 g (70 °C)[1] | ||
ద్రావణీయత in dimethyl sulfoxide | 18 g/100 g (25 °C)[1] | ||
బాష్ప పీడనం | 0.01 kPa (471 °C) 0.1 kPa (541 °C)[2] | ||
అయస్కాంత ససెప్టిబిలిటి | −6.87·10−5 cm3/mol[2] | ||
స్నిగ్ధత | 2.31 cP (597 °C) 1.87 cP (687 °C)[1] | ||
నిర్మాణం | |||
స్ఫటిక నిర్మాణం
|
Rhombohedral, hR9 (anhydrous)[4] Monoclinic (hemipentahydrate)[3] | ||
R3m, No. 166 (anhydrous)[4] | |||
3 2/m (anhydrous)[4] | |||
a = 3.846 Å, c = 17.479 Å (anhydrous)[4] α = 90°, β = 90°, γ = 120°
| |||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−391.5 kJ/mol[2] | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
115.3 J/mol·K[2] | ||
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 74.7 J/mol·K[2] | ||
ప్రమాదాలు | |||
భద్రత సమాచార పత్రము | External MSDS | ||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |||
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Danger | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H301, H330, H340, H350, H360, H372, H410 | ||
GHS precautionary statements | P210, P260, P273, P284, P301+310, P310 | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | మూస:R45, మూస:R46, R60, R61, R25, R26, మూస:R48/23/25, R50/53 | ||
S-పదబంధాలు | S53, S45, S60, S61 | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose)
|
94 mg/kg (rats, oral)[1] 60 mg/kg (mouse, oral) 88 mg/kg (rat, oral) | ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible)
|
[1910.1027] TWA 0.005 mg/m3 (as Cd) | ||
REL (Recommended)
|
Ca[5] | ||
IDLH (Immediate danger)
|
Ca [9 mg/m3 (as Cd)] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు
|
Zinc chloride Mercury(II) chloride Calcium chloride | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
కాడ్మియం క్లోరైడ్ఒకరసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం.కాడ్మియం, క్లోరిన్ మూలకాలపరమాణువుల సంయోగం వలన కాడ్మియం క్లోరైడ్ సంయోగ పదార్థం ఏర్పడినది.కాడ్మియం క్లోరైడ్ రసాయన సంకేత పదం CdCl2.కాడ్మియం క్లోరైడ్ ఆర్ద్రతాకర్షణ కలిగిన రసాయనపదార్థం.ఇది నీటిలో అధిక ద్రావణీయత కల్గిఉన్నది.ఆల్కహాల్లో కొద్ది ప్రమాణంలో కరుగును.
అణునిర్మాణం
[మార్చు]కాడ్మియం క్లోరైడ్ రొంబోహెడ్రాల్ సౌష్టవాన్ని(rhombohedral symmetry) కల్గిన స్పటికాలుగా ఏర్పడును.కాడ్మియం అయోడైడ్ అణుసౌష్టవం, కాడ్మియం క్లోరైడ్ అణుసౌష్టవం ఇంచుమించు ఒకేరకంగా ఉండును.రెండు అణునిర్మాణాలలో వైయక్తిక పొరలు ఒకే రీతిలో ఉన్నాయి.అయితే క్లోరైడ్ అయానులు CCPఅల్లిక(lattice) విధానంలో ఉండగా, కాడ్మియం అయోడైడ్ లోని అయోడైడ్ అయానులు HCP అల్లిక విధానంలో అమరి ఉండును.
భౌతిక లక్షణాలు
[మార్చు]భౌతిక స్థితి
[మార్చు]కాడ్మియం క్లోరైడ్ ఆర్ద్రతాకర్షణ కల్గిన తెల్లని ఘనపదార్థం. కాడ్మియం క్లోరైడ్ వాసన లేని రసాయన సంయోగపదార్థం. కాడ్మియం క్లోరైడ్ యొక్క అణుభారం 183.31 గ్రాములు/మోల్.
సాంద్రత
[మార్చు]25 °C ఉష్ణోగ్రత వద్ద, నార్ద్ర/నిర్జల కాడ్మియం క్లోరైడ్ సాంద్రత 4.047 గ్రాములు/సెం.మీ3. అయిదు జలాణువులు (pentahydrate) కలిగిన ఆర్ద్ర కాడ్మియం క్లోరైడ్ సాంద్రత 3.327 గ్రాములు/సెం.మీ3.
ద్రవీభవన ఉష్ణోగ్రత
[మార్చు]కాడ్మియం క్లోరైడ్ రసాయన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 568 °C(1,054 °F; 841K)
బాష్పీభవన ఉష్ణోగ్రత
[మార్చు]కాడ్మియం క్లోరైడ్ రసాయన పదార్థం యొక్క బాష్పీభవన స్థానం 964 °C (1,767 °F; 1,237K)
ద్రావణీయత
[మార్చు]కాడ్మియం క్లోరైడ్ నీటిలో కరుగును.అలాగే ఆల్కహాల్, సెలీనియం (IV) ఆక్సీక్లోరైడ్, బెంజోనైట్రిల్‌లలో కరుగును.కాని ఇథర్, అసిటోన్లలో కరుగదు.
రసాయన ధర్మాలు
[మార్చు]కాడ్మియం క్లోరైడ్ నీటిలోనూ, ఇతర ధ్రువీయ ద్రవాణాలలో బాగా కరుగుతుంది.కాడ్మియం క్లోరైడ్ నీటిలో [CdCl4]2−.వంటి సంక్లిష్ట ఆయానులను ఏర్పరచగలగటం వలన ఇది నీటిలో అమితమంగా కరుగును.ఈ స్వాభావం వలన కాడ్మియం క్లోరైడ్ తక్కువ స్థాయిలో లేవిస్ ఆమ్లం(Lewis acid) గా ప్రవర్తించును.
- CdCl2 + 2 Cl− → [CdCl4]2−
మరింత పెద్ద కెటాయానులతో త్రికోణియ ద్విపిరమిడల్ [CdCl5]3− ఆయాన్ ను వేరుపరచును.
ఉత్పత్తి
[మార్చు]బాగావేడిచేసిన కాడ్మియం లోహంతో క్లోరిన్ వాయువు లేదా హైడ్రోజన్ క్లోరైడ్ రసాయన చర్య వలన అనార్ద్ర/నిర్జల కాడ్మియం క్లోరైడ్ ఉత్పత్తి అగును. కాడ్మియం లోహంతో లేదా కాడ్మియం ఆక్సైడ్ లేదా కాడ్మియం కార్బోనేట్ తో హైడ్రో క్లోరిక్ ఆమ్లం రసాయబ చర్య వలన ఆర్ద్ర/జలయోజిత కాడ్మియం క్లోరైడ్ ఏర్పడును.
ఉపయోగాలు
[మార్చు]కాడ్మియం క్లోరైడ్ ను కాడ్మియం సల్ఫైడ్ ను తయారు చేయుటకు ఉపయోగిస్తారు. కాడ్మియం ఎల్లో("Cadmium Yellow") గా వ్యవహరింపబడుతున్న కాడ్మియం సల్ఫైడ్, ఒక స్థిరమైన ప్రకాశమైన పసుపు రంగును ఇచ్చు వర్ణరసాయన పదార్థం.
- CdCl2 + H2S → CdS + 2 HCl
ప్రయోగశాలలో/పరిశోధనశాలలో R2Cd రకానికి చెందిన సేంద్రియకాడ్మియం సమ్మేళనాలు(organoCadmium compounds) తయారుచేయుటకు కాడ్మియం క్లోరైడ్‌ను ఉపయోగిస్తారు. ఇక్కడ R అను అక్షరము అరైల్(aryl) లేదా అల్కైల్(alkyl) సమూహాన్ని ప్రతిపాదిస్తున్నది. వీటిని ఒకప్పుడు కిటోనులు, అకైల్ క్లోరైడ్(acyl chlorides) లను సంశ్లేషణ చేయుటకు ఉపయోగించారు.
- CdCl2 + 2 RMgX → R2Cd + MgCl2 + MgX2
- R2Cd + R'COCl → R'COR + CdCl2
కాడ్మియం క్లోరైడ్‌ను పోటో కాపింగ్, రంగుల అద్దకం, ఎలక్ట్రోప్లెటింగ్ లలో ఉపయోగిస్తారు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Anatolievich, Kiper Ruslan. "cadmium chloride". chemister.ru. Archived from the original on 2014-05-24. Retrieved 2014-06-25.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 Lide, David R., ed. (2009). CRC Handbook of Chemistry and Physics (90th ed.). Boca Raton, Florida: CRC Press. ISBN 978-1-4200-9084-0.
- ↑ 3.0 3.1 Seidell, Atherton; Linke, William F. (1919). Solubilities of Inorganic and Organic Compounds (2nd ed.). New York: D. Van Nostrand Company. p. 169.
- ↑ 4.0 4.1 4.2 4.3 "Cadmium Chloride - CdCl2". chem.uwimona.edu.jm. Mona, Jamaica: The University of the West Indies. Retrieved 2014-06-25.
- ↑ NIOSH Pocket Guide to Chemical Hazards. "#0087". National Institute for Occupational Safety and Health (NIOSH).