కాపు రామచంద్రారెడ్డి
కాపు రామచంద్రారెడ్డి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | రాయదుర్గం నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 06 అక్టోబర్ 1964 నాగిరెడ్డిపల్లి గ్రామం బ్రహ్మసముద్రం మండలం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | కాపు గంగమ్మ, కాపు చిన్న తిమ్మప్ప | ||
జీవిత భాగస్వామి | కాపు భారతి | ||
సంతానం | ప్రవీణ్ కుమార్ రెడ్డి, స్రవంతి |
కాపు రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]కాపు రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, బ్రహ్మసముద్రం మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో 1964 అక్టోబరు 06లో కాపు చిన్న తిమ్మప్ప, గంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 5వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకొని, కర్ణాటకలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి పూర్తి చేసి ఎంకాం (కర్ణాటక యూనివర్సిటీ), బీఎల్., ఐఎస్‌సీ (గుల్బర్గా యూనివర్సిటీ) లో పూర్తి చేసి కొంతకాలం పాటు న్యాయవాదిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కాపు రామచంద్రారెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ సీపీలో చేరి 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
కాపు రామచంద్రారెడ్డి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 14,049 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వ విప్‌గా నియమితుడయ్యాడు.[2]
కాపు రామచంద్రారెడ్డి 2023 జనవరి 05న వైసీపీకి రాజీనామా చేశాడు.[3] ఆయన మార్చి 16న విజయవాడలోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Eenadu (5 January 2024). "వైకాపాకు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్‌బై". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.
- ↑ ETV Bharat News (16 March 2024). "బీజేపీలో చేరిన రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.