కామంచి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కామంచి
Solanum nigrum.jpeg
Scientific classification
Kingdom
Division
Class
Order
Family
Genus
Species
సొ. నైగ్రమ్
Binomial name
సొలానమ్ నైగ్రమ్
ఉపజాతులు

S. nigrum subsp. nigrum
S. nigrum subsp. schultesii

కామంచి (ఆంగ్లం: Black Nightshade) ఒక విధమైన చిన్న మందు మొక్క. దీని శాస్త్రీయనామం సొలానమ్ నైగ్రమ్ (Solanum nigrum). ఇది సొలనేసి కుటుంబంలో సొలానమ్ ప్రజాతికి చెందినది.

ప్రాంతీయ నామాలు[మార్చు]

 • ఆంగ్లం : Black Night shade
 • హిందీ : మకోయి, గుర్కమ్మాయి
 • కన్నడ : కాకరుండి
 • మలయాళం : మనట్టక్కళి, కరింతకళి
 • తమిళం : మనతక్కాళి, మిలగుటక్కళి

లక్షణాలు[మార్చు]

 • ఇది నిటారుగా పెరిగే చిన్న పొద.
 • తీవ్రాగ్రంతో ఇంచుమించు అండాకారంలో ఉన్న సరళ పత్రాలు కలిగివుంటాయి.
 • గ్రీవేతరంగా ఏర్పడిన నిశ్చిత గుచ్ఛంలో అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు పూస్తాయి.
 • వలయాకారంలో ఉన్న నలుపు రంగు మృదు ఫలాలు కాస్తాయి.

ఉపయోగాలు[మార్చు]

ఈ మొక్క యావత్తు వివిధ ఔషధ ప్రయోగాలున్నాయి.[1]

 • ఇది యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది
 • ఇది శోధ, దగ్గు, జ్వరం, ఆస్తమా నివారణకు దివ్యౌషధం.
 • విరేచనకారిగాను, జీర్ణకారిగాను పనిచేస్తుంది.
 • కీళ్లనొప్పులు, బ్రాంకైటిస్, అల్సర్లు, అజీర్తి, నిస్సత్తువ వంటి లక్షణాలను అరికడుతుంది.
 • మూత్రం సాఫీగా జారీ అయ్యేలా ఉపయోగపడుతుంది.
 • ఈ మొక్క భాగాలను నీళ్లలో కాచి వడపోసి డికాక్షన్ తాగితే గుండె జబ్బుల్లో బాగా పనిచేస్తుంది. రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది.

మూలాలు[మార్చు]

 1. కామంచి, ముఖ్యమైన ఔషధ మొక్కలు - సాగు పద్ధతులు, ఆంధ్రప్రదేశ్ ఔషధ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాద్, పేజీలు: 95-98.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కామంచి&oldid=2989855" నుండి వెలికితీశారు