కామన్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కామన్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ) తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో ప్రవేశంకోసం ప్రతి సంవత్సరం నిర్వహించబడే పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత పరీక్ష. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, మహబూబ్ నగర్ లోని పాలమూరు విశ్వవిద్యాలయం, నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, నిజామాబాదులోని తెలంగాణ విశ్వవిద్యాలయంలలో దాదాపు 19,000 సీట్లు ఉన్నాయి.[1][2] ప్రతి సంవత్సరం మే/జూన్‌ నెలల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుంది.

గతంలో దీనిని ఉస్మానియా విశ్వవిద్యాలయ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఓయుసెట్), అని పిలిచేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అందించే వివిధ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియను క్రమబద్ధీకరించే లక్ష్యంతో 2000 సంవత్సరంలో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ స్థాపించబడింది. 2000-2001 విద్యా సంవత్సరం నుండి విశ్వవిద్యాలయం, దాని అనుబంధ సంస్థలు అందించే అడ్మిషన్ ప్రక్రియను డైరెక్టరేట్ నిర్వహిస్తోంది. తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాలు ప్రారంభమైనప్పటి నుండి ఆయా విశ్వవిద్యాలయాలు అందించే వివిధ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ కూడా ఈ డైరెక్టరేట్ పరిధిలోనే జరుగుతోంది. 2020, 2021లలో ప్రవేశ పరీక్షల నిర్వహణను ఉస్మానియా విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించింది.[3]

చరిత్ర[మార్చు]

2011 నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడం ప్రారంభమైంది. తరువాత 2019 ఏప్రిల్ లో ఓయుసెట్ ను సిపిజెట్ గా (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్‌లు) మార్చింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ కళాశాలలు అందించే వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ప్రవేశం కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంసిజె, బిఎల్‌ఐఎస్‌సి, ఎంఎల్ఐఎస్‌సి, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎడ్, ఎంపిఎడ్, డిగ్రీ కోర్సులలో ప్రవేశాన్ని అందిస్తోంది.[4]

ప్రధాన అర్హతలు[మార్చు]

 • అభ్యర్థి భారతీయ జాతీయత కలిగి ఉండాలి.
 • దరఖాస్తుదారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
 • విద్యార్థులు బిఏ, బిఎస్సీ, బ్యాచిలర్ డిగ్రీలలో కనీసం 40% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

ఫార్మాట్, టైమింగ్[మార్చు]

 • 39 పిజీ కోర్సులు, 10 పిజీ డిప్లొమా కోర్సులు, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు కలిపి మొత్లం 52 సబ్జెక్టులలో ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
 • ఈ ప్రవేశ పరీక్ష రెండు గంటల బహుళైచ్ఛిక ప్రశ్నపత్రం ఉంటుంది. సబ్జెక్ట్ వారీగా ర్యాంకులు క్రమబద్ధీకరించబడి, విద్యార్థులకు పంపబడతాయి.[5]

ఫలితాలు[మార్చు]

ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు జూన్/జూలై నెలల్లో వెలువడతాయి. సీట్ల కేటాయింపు కోసం జూన్ నెల చివరిలో లేదా జూలై నెల ప్రారంభంలో కౌన్సెలింగ్ జరుగుతుంది. జూలై నెల చివర్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.

సీట్ల పంపిణీ[మార్చు]

మొత్తం సీట్లు - 18,881

నాలుగు విశ్వవిద్యాలయ క్యాంపస్ కాలేజీలలో 4500 సీట్లు, మిగిలిన సీట్లు వాటి అనుబంధ కాలేజీలలో ఉన్నాయి.

 • ఉస్మానియా విశ్వవిద్యాలయం - 13,027
 • తెలంగాణ విశ్వవిద్యాలయం - 1,990
 • మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం - 2,630
 • పాలమూరు విశ్వవిద్యాలయం - 1,234[6]

మూలాలు[మార్చు]

 1. "OUCET results released; counselling likely from June last week". The Hindu. 2013-06-17. Retrieved 2021-10-20.
 2. "OUCET-2013 results announced". Deccan Chronicle. 2013-06-17. Archived from the original on 2013-06-22. Retrieved 2021-10-20.
 3. ":: CPGET 2021 ::". tscpget.com. Retrieved 2021-10-20.
 4. ":: CPGET 2021 ::". tscpget.com. Retrieved 2021-10-20.
 5. "OUCET counselling from end of June". The New Indian Express. Archived from the original on 2015-11-24. Retrieved 2021-10-20.
 6. "OUCET results released". The Hindu. 2013-06-18. Retrieved 2021-10-20.