కారైక్కుడి సాంబశివ అయ్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కారైక్కుడి సాంబశివ అయ్యర్
వ్యక్తిగత సమాచారం
జననం1888
తిరుగోకర్ణం, తమిళనాడు
మరణం1958 (aged 69–70)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివీణావాద్య కళాకారుడు
వాయిద్యాలువీణ
1952లో రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ నుండి అవార్డు స్వీకరించిన సాంబశివ అయ్యర్ (కుడి నుండి మొదటి వ్యక్తి)

కారైక్కుడి సాంబశివ అయ్యర్ (1888 - 1958) కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. వీణ వాద్యకారుడు.


ప్రారంభజీవితం[మార్చు]

ఇతడు 1888వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం, పుదుక్కొట్టై జిల్లా, తిరుగోకర్ణంలో వీణ విద్వాంసుడు సుబ్బయ్య అయ్యర్‌కు రెండవ కుమారుడిగా జన్మించాడు. ఇతడు తన తండ్రి సుబ్బయ్య అయ్యర్ వద్ద తన అన్న సుబ్బరామ అయ్యర్‌తో కలిసి వీణ నేర్చుకున్నాడు. వీరిద్దరూ వారి కుటుంబంలో ఏడవ తరానికి చెందిన వీణా విద్వాంసులు. ఇద్దరూ కలిసి "కారైక్కుడి బ్రదర్స్" పేరుతో కచేరీలు నిర్వహించారు. వీరిద్దరూ మొదటి కచేరీనుండి 1934వరకూ అప్రతిహతంగా జంటగా కచేరీలు చేశాడు. సాంబశివ అయ్యర్ తన భీకరమైన సాధనతో "అసుర సాధకుడి"గా పేరు పొందాడు.

ఇతనికి సంతానం కలగలేదు. 1957లో ఇతడు కారైక్కుడి ఎస్.సుబ్రహ్మణ్యన్‌ను దత్తత తీసుకున్నాడు.

వృత్తి[మార్చు]

ఇతడు చెన్నైలోని కళాక్షేత్రలో వీణ బోధిస్తూ అక్కడే నివసించాడు.[1] 1952లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రవేశపెట్టిన సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన మొట్టమొదటి కళాకారులలో ఇతడు ఉన్నాడు.[2] అదే ఏడాది మద్రాసు సంగీత అకాడమీ ఇతడికి సంగీత కళానిధి పురస్కారం ప్రకటించింది.[3] 1954లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రకటించిన మొట్టమొదటి ఫెలోషిప్ జాబితాలో కూడా ఇతడు ఉన్నాడు.[4]

ఇతని శిష్యులలో రంగనాయకి రాజగోపాల్, రాజేశ్వరీ పద్మనాభన్, జయలక్ష్మి సుకుమార్, కారైక్కుడి సుబ్రహ్మణ్యన్ మొదలైన వారున్నారు.[5]

ఇతడు 1958లో మరణించాడు.

జీవితచరిత్ర[మార్చు]

  • బర్త్ సెంటెనరీ ఆఫ్ సంగీత కళానిధి సాంబశివ అయ్యర్ 1888-1988. ఇండియా ఇంటర్నేషనల్ రూరల్ కల్చరల్ సెంటర్. 1988.

మూలాలు[మార్చు]

  1. Avanthi Meduri (1 January 2005). Rukmini Devi Arundale: (1904 - 1986) ; a Visionary Architect of Indian Culture and the Performing Arts. Motilal Banarsidass Publisher. pp. 95–. ISBN 978-81-208-2740-0. Retrieved 19 July 2013.
  2. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 30 May 2015.
  3. "Sangita Kalanidhi recipients". Madras Music Academy website. Archived from the original on 30 డిసెంబరు 2012.
  4. "SNA: List of Sangeet Natak Akademi Ratna Puraskarwinners (Akademi Fellows)". SNA Official website. Archived from the original on 4 March 2016.
  5. Jeff Todd Titon (2008). Worlds of Music: An Introduction to the Music of the World's Peoples: An Introduction to the Music of the World's Peoples. Cengage Learning. pp. 289–. ISBN 978-0-534-59539-5. Retrieved 19 July 2013.

బయటి లింకులు[మార్చు]