కాళిదాస్ కొలంబ్కర్
కాళిదాస్ నీలకంత్ కొలంబ్కర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 | |||
నియోజకవర్గం | వాడలా | ||
---|---|---|---|
పదవీ కాలం 1990 – 2009 | |||
తరువాత | నియోజకవర్గం రద్దు చేయబడింది | ||
నియోజకవర్గం | నైగాం శాసనసభ నియోజకవర్గం (ముంబై ప్రాంతం) | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1954 మహారాష్ట్ర, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కాళిదాస్ సులోచన నీలకంఠ కొలంబకర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]కాళిదాస్ కొలంబ్కర్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నైగాం శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1995, 1999, 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2005లో నారాయణ్ రాణేతో కలిసి శివసేన పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
కాళిదాస్ కొలంబ్కర్ 2009, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాడలా శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై 2019లో కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 2019, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఎనిమిదొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
కాళిదాస్ కొలంబ్కర్ మహారాష్ట్ర శాసనసభకు తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యుల చేత ప్రమాణస్వీకారం చేపించేందుకు 2024 డిసెంబర్ 6న ముంబైలోని రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Who is Kalidas Kolambkar, candidate who scored 1st win for BJP in Maharashtra?" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 23 November 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "BJP's Kalidas Kolambkar is confident in winning Maharashtra polls, aims to enter Guinness Book Record" (in Indian English). The Hindu. 31 October 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "9-term BJP MLA is pro-tem speaker; three-day special session starts today". The Times of India. 6 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "Nine-term BJP MLA Kalidas Kolambkar takes oath as pro-tem speaker". Hindustan Times. 7 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.