Jump to content

కాళీ చరణ్ ముండా

వికీపీడియా నుండి
కాళీ చరణ్ ముండా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు అర్జున్ ముండా
నియోజకవర్గం ఖుంటి

వ్యక్తిగత వివరాలు

జననం (1961-11-10) 1961 నవంబరు 10 (వయసు 63)
మహిల్, ఖుంటి, జార్ఖండ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు ముచ్చిరాయ్ ముండా, రాధికా దేవి
జీవిత భాగస్వామి పార్వతీ దేవి

కాళీ చరణ్ ముండా (జననం 10 నవంబర్ 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

కాళీ చరణ్ ముండా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1992, 1995  బీహార్ శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1997 నుండి 2007 వరకు రాంచీ జిల్లా రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అర్జున్ ముండా చేతిలో 1445 ఓట్ల స్వల్ప తేడాతో  ఓడిపోయాడు.

కాళీ చరణ్ ముండా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అర్జున్ ముండాపై 1,49,675 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (5 June 2024). "Khunti (ST) election results 2024 live updates: CONG's Kali Charan Munda wins against BJP's Arjun Munda with a margin of 149675 votes". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Khunti". Retrieved 26 July 2024.
  3. TV9 Bharatvarsh (5 June 2024). "कांग्रेस के कालीचरण मुंडा खूंटी से डेढ़ लाख वोटों के अंतर से जीते, पिता को लोग बुलाते थे झारखंड का 'गांधी'". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ETV Bharat News (4 June 2024). "Khunti Lok Sabha Seat Result 2024: Kali Charan Munda Defeats Union Minister Arjun Munda" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  5. The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.