కావడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కావడితో నీళ్ళు మోస్తున్న రైతు

కావడి లేదా కావిడి బరువుల్ని మోయడానికి ఉపయోగించే సాధనం. దీనిలో పొడవైన కట్టెకి రెండు వైపులా బరువైన వస్తువుల్ని ఉంచడానికి ఉట్టి లాంటివి వేలాడుతూ ఉంటాయి. మోయాల్సిన నీటి బిందెలు మొదలైన వస్తువుల్ని రెండు ఉట్టెలలో ఉంచి బాలన్సింగ్ చేసుకుంటూ భుజం మీద పెట్టుకుంటారు. పల్లెటూర్లలో ఇప్పటికీ కూలీలు ఈ పద్ధతిలోనే చెరువు లేదా నూతినుండి నీరును ఇండ్లకు పోస్తారు.

తమిళనాడు ప్రాంతంలో సుబ్రహ్మణ్య షష్టి నాడు కుమార స్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే "కావడి పూజ"లోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది.

"కలిమి లేములు కావడి కుండలు" అనేది నానుడి. కావడిలోని కుండల మాదిరిగా మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు సమానంగా తీసుకోవాలని అర్ధంతో దీనిని ఉపయోగిస్తారు.

శ్రవణ కుమారుడు వయసు మీరిన ఒక అంధ దంపతులకు జన్మించాడు. వారిరువురినీ పోషించిడం కోసం బాలుడైన శ్రవణ కుమారుడు సంపాదించవలసి వచ్చేది. ఈ ప్రయత్నంలోనే అతడు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తుండేవాడు. తన తల్లిదండ్రులు వృద్ధులు, అంధులు కావడం చేత వారు తనతో పాటు నడవలేరని ఒక కావడిలో కూర్చుండ బెట్టుకొని ఆ కావడిని తన భుజంపై మోస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుండేవాడు. ఇతడినే దశరథుడు తెలియక వేటాడి, శాపానికి గురై శ్రీరామున్ని కోల్పోయి పుత్రశోకాన్ని అనుభవించాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=కావడి&oldid=2879550" నుండి వెలికితీశారు