కాశీరామ్ రాణా
కాశీరామ్ రాణా | |||
కాశీరామ్ రాణా కాశీరామ్ రాణా | |||
పదవీ కాలం 1998 – 25 మే 2003 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
---|---|---|---|
తరువాత | సయ్యద్ షానవాజ్ హుస్సేన్[1] | ||
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 25 మే 2003 – 22 మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
ముందు | వెంకయ్య నాయుడు | ||
తరువాత | రఘువంశ్ ప్రసాద్ సింగ్ | ||
పదవీ కాలం 1989 – 2009 | |||
ముందు | సి. డి. పటేల్ | ||
తరువాత | దర్శన జర్దోష్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సూరత్, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1938 ఏప్రిల్ 7||
మరణం | 2012 ఆగస్టు 31 అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం | (వయసు 74)||
జీవిత భాగస్వామి | దివంగత పుష్పా రాణా | ||
సంతానం | 2 కుమారులు, 4 కుమార్తెలు | ||
పూర్వ విద్యార్థి | దక్షిణ గుజరాత్ విశ్వవిద్యాలయం, సూరత్[2] | ||
వృత్తి | న్యాయవాది , రాజకీయ నాయకుడు |
కాశీరామ్ రాణా (7 ఏప్రిల్ 1938 - 31 ఆగస్టు 2012) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో గుజరాత్‌లోని సూరత్ నియోజకవర్గం నుంచి 9వ లోక్‌సభకు తొలిసారి ఎన్నికై ఆ తరువాత 1991, 1996, 1998, 1999, 2004లో వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. కాశీరామ్ రాణా 1998-2004 మధ్యకాలంలో అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పని చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]కాశీరామ్ రాణా 7 ఏప్రిల్ 1938న గుజరాత్ రాష్ట్రం, సూరత్ లో ఛబిల్దాస్, కాశీబెన్ దంపతులకు జన్మించాడు. ఆయన సౌత్-గుజరాత్ విశ్వవిద్యాలయం, సూరత్ (గుజరాత్) నుండి బి.కాం., ఎల్‌ఎల్‌బి పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]1. 1975-80, గుజరాత్ శాసనసభ సభ్యుడు
2. 1977-80 ఛైర్మన్, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ, గుజరాత్ శాసనసభ
3. 1983-84 & 1987 మేయర్, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్
4. 1985-87 & 1993-96, గుజరాత్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు
5. 1989 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
6. 1990-91 సభ్యుడు, రూల్స్ కమిటీ
7. సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, రైల్వే మంత్రిత్వ శాఖ
8. 1991 10వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ పర్యాయం)
9. 1991-92 సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
10. సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
11. 1996 11వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (3వ పర్యాయం)
12. 1996-97 సభ్యుడు, అంచనాల కమిటీ
13. సభ్యుడు, వాణిజ్య కమిటీ
14. సభ్యుడు, బ్రాడ్‌కాస్టింగ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ
15. 1998 12వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (4వ పర్యాయం)
16. 1998-99 కేంద్ర క్యాబినెట్ మంత్రి, జౌళి శాఖ
17. 1999 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (5వ సారి)
18. 13 అక్టోబర్ 1999 - 23 మే 2003 కేంద్ర కేబినెట్ మంత్రి, జౌళి శాఖ
19. 24 మే 2003- మే 2004 కేంద్ర కేబినెట్ మంత్రి, గ్రామీణాభివృద్ధి
20. 2004 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (6వ పర్యాయం)
మరణం
[మార్చు]కాశీరాం రాణా 2012 ఆగస్టు 31న అహ్మదాబాద్‌లో గుండెపోటుతో మరణించాడు. ఆయనకు 2 కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. కాశీరాం రాణా భార్య పుష్ప 1997లో మరణించింది.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Rudy gets civil aviation in reshuffle". Times of India. 25 May 2003.
- ↑ "Bio-sketch of Kashiram Rana, 13th Lok Sabha". Ministry of Parliamentary Affairs.
- ↑ The Hindu (31 August 2012). "Former textile minister, Kashiram Rana passes away" (in Indian English). Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
- ↑ India Today (31 August 2012). "BJP rebel Kashiram Rana passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
- ↑ The Indian Express (1 September 2012). "Kashiram Rana dies of heart attack, Modi visits family" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.