కాసు ప్రసాదరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాసు ప్రసాదరెడ్డి (kasu prasadareddy) నేత్రవైద్య పరిశోధకులు, నిపుణులు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబంలో జన్మించారు. గుంటూరు మెడికల్ కాలేజి, మద్రాసు మెడికల్ కాలేజీలో ఆ తరువాత లండన్ లో ఉన్నత వైద్య విద్యాభ్యాసం చేసారు. నేత్ర వైద్యరంగంలొ పరిశోధనలు చేసారు. పలు అంతర్జాతీయ నేత్ర వైద్య సదస్సులలొ పరిశోధన పత్రాలను సమర్పించారు. దశాబ్దాల పర్వంతం లండన్ లో నెత్ర వైద్యులుగా భారతీయ వైద్యుల ప్రతిభాపాటవాన్ని సమర్థవంతంగా చాటి చెప్పారు. ప్రతిష్టాత్మకమైన రాయల్ కాలేజి ఆఫ్తల్మోలజీలో అమెరికా, యూరప్ కాటరాక్టివ్ రిప్రాక్టివ్ సర్జరీ సొసైటీలలో గౌరవ సభ్యత్వాన్ని అందుకున్నారు. 1996 లో స్వరాష్ట్రం వచ్చారు. నేత్ర వైద్యానికి, చికిత్సా రంగానికి నూతన గవాక్షాలను ఆవిష్కరించారు. మాక్సివజన్ లేజర్ సెంటర్ (హైదరాబాదు) అత్యాధునిక నేత్ర వైద్య పరికరాలను సమకూర్చి అత్యద్భుతమైన సేవలనందిచడం ప్రారంభించారు.[2] హైదరాబాదులోనే కాక, విజయవాడ, విశాఖపట్టణం లలో కూడా మాక్సివిజన్ బ్రాంచీలను నెలకొల్పి కంటి చూపు సమస్య ఉన్న వారికి ప్రామాణిక చికిత్సలను అందిస్తున్నారు. ఆంధ్ర ప్రదెశ్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంది ఉత్తమ పరిశొధకుని అవార్డు, "ఆటా" నుండి ఉత్తమ వైద్యులకు అమర్గదర్శిగా, యువతరం పరిశోధనలకు స్ఫుర్తి ప్రదాతగా ఉన్నన డాక్టర్ కాసుప్రసాదరడ్డి తెలుగువారికి గర్వకారణమయ్యారు.

మాక్సివిజన్[మార్చు]

కాంటాక్ట్ లెన్స్.. లేసిక్.. ఐఒఎల్.. దృష్టిలోపాలను సవరించి, కళ్లద్దాలను దూరం చేయడానికి ఎన్నో రకాల చికిత్సలను అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి ఎంచుకున్న ఆధునిక టెక్నిక్ ఫేకోటెక్‌మిక్స్. మొన్నటివరకు లేజర్ చికిత్స, లేసిక్ లేదా వేరే లెన్సును అమర్చడం ద్వారా కళ్లజోడు నుంచి విముక్తి కల్పిస్తున్నది అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు వీటన్నింటి కన్నా ముందంజలో ఉన్నది ఫేకోటెక్‌మిక్స్ ఇలాంటి 5రకాల టెక్నాలజీలను మిళితం చేసి రూపొందించిన చికిత్స ఇది.

  1. ఫెమ్టోసెకండ్ లేజర్ : ఆపరేషన్ గది బయటే కచ్చితమైన ఆపరేటివ్ స్టెప్స్
  2. ఎంఐసిఎస్ : లెన్సును ఎమల్సిఫై చేయడానికి కంటిలోకి ప్రవేశించే మార్గం
  3. వేవ్‌టెక్ ఓరా : ఆపరేటింగ్ టేబుల్‌పై సరైన ఐఓఎల్ పవర్‌ను లెక్కించడానికి
  4. ప్రీమియం ఐఓఎల్ : ఇవి మోనోఫోకల్, మల్టీఫోకల్, అకామడేటివ్ లేదా టోరిక్ ఐఓఎల్ ఉంటాయి.
  5. లేసిక్ : రెండు నెలల తరువాత మిగిలిన పవర్ ఏమన్నా ఉంటే ట్రీట్ చేయడానికి.

ఈ సాంకేతిక పరిజ్ఞానాలను మిళితం చేసి కన్నులోని లెన్సు స్థానంలో కృత్రిమ లెన్సును అమర్చడాన్నే ఫేకోటెక్‌మిక్స్ అంటారు. అంటే టెక్నాలజీ మిక్చర్ అన్నమాట.[3]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]