Jump to content

కిగ్గా

వికీపీడియా నుండి
కిగ్గా
ఋష్యశృంగపుర
గ్రామం
దేశం India
రాష్ట్రంకర్ణాటక
జిల్లాచిక్కమగళూరు
భాషలు
 • అధికారికకన్నడ
Time zoneUTC+5:30 (IST)
సమీప పట్టణంశృంగేరి

కిగ్గా, కర్ణాటక రాష్ట్రం, చిక్కమగళూరు జిల్లాలోని గ్రామం. ఇది, తుంగ నదికి ఉపనదైన నందిని ఒడ్డున శృంగేరికి 10 మైళ్ళ దూరములో ఉంది. కిగ్గా గ్రామానికి మరుకలు అనే పేరు కూడా ఉంది. ఈ గ్రామంలో అత్యంత ప్రశస్తి చెందిన ఋష్యశృంగ మహర్షి దేవాలయము ఉంది. ఈ ప్రదేశములోనే ఋష్యశృంగుడు మెరుపుతీగ వలె మారి దేహవిముక్తి పొందారు అని చెబుతారు. ఈ గ్రామానికి ఋష్యశృంగపుర అని కూడా పేరుంది. ఇక్కడ ఏడవ శతాబ్దపు శాసనాలు ఉన్న ఆలయం ఉంది. ఈ ఆలయం పేరు కిల్గలింగేశ్వర లేదా కిల్గదేవర ఆలయం. ఇక్కడ పూజలు జరిగేవని ఈ శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడి శివలింగంపైన ఉండే రుద్రాక్ష ఒక కొమ్ము ఆకారంలో ఉంటుంది.

నరసింహ పర్వతం కిగ్గాలోని ఆకర్షణ. ఇది అగుంబే వద్దనున్న పర్వతాల్లో కెల్లా ఎత్తైనది. సిరిమానే జలపాతం కిగ్గాకు దగ్గర్లో ఉంది.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కిగ్గా&oldid=3572158" నుండి వెలికితీశారు