కిన్నెర ఆర్ట్ థియేటర్స్
Jump to navigation
Jump to search
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ (Kinnera Art Theatres) 1977 సంవత్సరంలో స్థాపించబడిన సాహితీ సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ శ్రీ. యం. వి. నారాయణరావు గారి అధ్యక్షతను స్థాపించబడినది., ప్రస్తుతం ఈ సంస్థకు ఆర్. ప్రభాకరరావు గారు అధ్యక్షులుగా, మద్దాళి రఘురామ్ కార్యదర్శిగా సేవలను అందిస్తున్నారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉన్నది.
అనుబంధ సంస్థలు
[మార్చు]- 1980లో దీనికి అనుబంధంగా "కిన్నెర పబ్లికేషన్స్" ను స్థాపించి ఇప్పటివరకు 118 గ్రంథాలను ముద్రించారు. అగ్నిహంస (2011), నాటి 101 చిత్రాలు (2006), అక్కినేని అభిమానిగా (2014), అక్కినేని కథానాయకలు (2011) అక్కినేని చిత్రాల్లో సూక్తులు (2012), అమ్మ (2010), నాన్న, గ్రేట్ డైరెక్టర్స్, కారెక్టర్ ఆర్టిస్టులు, మా నాన్నగారు ఇందులో కొన్ని ముఖ్యమైనవి.[1]
- 1984లో "నృత్యకిన్నెర" సంస్థను కూడా స్థాపించారు.
- 1984లో కిన్నెర కల్చరల్ & ఎడ్యుకేషనలు సంస్థను స్థ్పాఇంచారు.
- 2002 లో కిన్నెర - కర్నల్ నాగేంద్రరావు ట్రస్ట్ ను స్థాపించారు.
- 2005 లో కిన్నెర - యం.వి.నారాయణరావు స్మారక ట్రస్ట్ ను స్థాపించారు.
కార్యక్రమాలు
[మార్చు]- ప్రతి సంవత్సరంలో నవంబరు నెలలో కెన్నెర సంస్థ వార్షికోత్సవాలను సాంస్కృతిక ఉత్సవాలుగా నిర్వహిస్తున్నది.[2]
- 1990 నుండి సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన వ్యక్తులకు కిన్నెర ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.
- 2019లో రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమం కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా, కె.వి. రమణాచారి అధ్యక్షులుగా నిర్వహించబడింది. జస్టిస్ బులుసు శివశంకరరావు, అంజని కుమార్, బ్రిగేడియర్ కమల్ దేవ్, జె.ఎస్.మూర్తి (విహారి), చెరుకూరి వీరయ్య, శంకరనారాయణ, సి. రమాదేవి, లక్ష్మీనివాస్ శర్మ, జి. సూర్యప్రకాశ్, జయప్రకాష్ రెడ్డి, సరళ కుమారి, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం, వడ్డేపల్లి శ్రీనివాస్, మర్రి రమేష్ లకు ఉగాది పురస్కారాలు అందుకున్నారు. ఇందులో భాగంగా కుమారి ప్రణతి సంగీత గాత్రకచేరి జరిగినది.[3]
- 1994 నుండి 2016 వరకు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఆరాధనోత్సవాలను జరిపారు.
- 1991 నుండి 2011 వరకు రావు గోపాలరావు పేరిట 3 రోజుల నాటకోత్సవాలను నిర్వహించారు.
రజతోత్సవాలు
[మార్చు]2002 సంవత్సరంలో సంస్థ రజతోత్సవాలను లలిత కళాతోరణంలో రోజులపాటు 23 జిల్లాలకు చెందిన కళాకారులతో ఉత్సవాలను జరిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం కిన్నెర లోగోతో ప్రత్యేక తపాలాబిళ్లను విడుదల చేశారు.
మూలాలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.