మద్దాళి రఘురామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మద్దాళి రఘురామ్ సాంస్కృతిక కార్యకర్తగా సుపరిచితుడు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అనే సంస్థను స్థాపించి కార్యదర్శిగా ఉంటున్నాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు డా.మద్దాళి సుబ్బారావు, బాలసరస్వతి దంపతులకు నెల్లూరులో జన్మించాడు. ఇతని తండ్రి సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో అధికారిగా పనిచేసేవాడు. అతడు హోమియోపతి డాక్టరుగా, రమణమహర్షిపై అనేక గ్రంథాలు రచించినవాడుగా ప్రసిద్ధుడు. రఘురామ్‌ బాల్యం, ప్రాథమిక, హైస్కూలు విద్యలు నెల్లూరు, ఖమ్మం, విజయనగరంలలో కొనసాగింది. అమలాపురం కాలేజీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. తరువాత ఇతడు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వనరుల సంస్థలో ఉద్యోగిగా చేరి సుమారు 7 సంవత్సరాలు పనిచేశాడు. ఉద్యోగం చేసే సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలవైపు ఆకర్షితుడయ్యాడు. 1977లో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థను జంటనగరాలలో ముఖ్యమైన సాంస్కృతిక సంస్థగా తీర్చిదిద్ది వేలాది సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రముఖ కవులను, కళాకారులను సత్కరిస్తూ వచ్చాడు. ఈ సంస్థ ద్వారా నేటి వరకు 100 పైగా గ్రంథాలు ప్రచురించి సాహితీలోకానికి అందించాడు. ఇతని భార్య హంస పురస్కారగ్రహీత మద్దాళి ఉషాగాయత్రి ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి. మద్దాళి రఘురామ్‌ ఫిలిం సెన్సార్ బోర్డులో సభ్యునిగా 6 సంవత్సరాలు, నంది టి.వి.అవార్డుల కమిటీలో మూడుపర్యాయాలు, నంది సినిమా అవార్డుల ఎంపిక కమిటీలో రెండుపర్యాయాలు సభ్యునిగా సేవలను అందించాడు.

రచనలు

[మార్చు]
  1. వెండి వెన్నెల (సేకరణ)
  2. పాతికేళ్ళ తెలుగు సాంస్కృతిక రంగం (సంపాదకత్వం)
  3. వెన్నెల కన్నీరు
  4. అరవై ఏళ్ళ తెలుగు సినిమా (సంకలనం)
  5. ఆధునిక కవిత - అభిప్రాయ వేదిక (సంకలనం)
  6. నాన్న ( కవితా సంకలనం)
  7. బాలసాహితీ వైభవం (సంపాదకత్వం)
  8. బాలసాహిత్యం-లక్షణాలు
  9. భారతీయ భక్తి వైభవం (సంపాదకత్వం)
  10. అక్కినేని అభిమానిగా
  11. తెలుగువారి గుండెల్లో గుమ్మడి
  12. సినారె అభిమానిగా..
  13. తెలుగు ప్రముఖులు
  14. తెలుగు కిరణం
  15. అక్షర (డా.ఎన్.గోపి షష్ట్యబ్దిపూర్తి ప్రత్యేకసంచిక) (సంపాదకత్వం)
  16. తెలుగు రచయితల డైరక్టరీ (సంపాదకత్వం)

గౌరవ పురస్కారాలు

[మార్చు]