కిమిడి మృణాళిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కిమిడి మృణాళిని 2014 సార్వత్రిక ఎన్నికలలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఈమె గెలుపొందారు. ఈమె భర్త శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి గణపతిరావు. వృత్తిరీత్యా డాక్టర్లయిన వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మాజీ శాసన సభ్యులు అయిన గణపతిరావు మాజీ మంత్రి కళా వెంకట్రావుకు స్వయాన సోదరుడు. మృణాళిని గతంలో రెండుసార్లు శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఈమె 2014 ఎన్నికల్లో తొలిసారి శాసన సభ్యులుగా గెలుపొంది మంత్రి అయ్యారు. ఈమె వయస్సు 56 సంవత్సరాలు.

మూలాలు[మార్చు]

సాక్షి దినపత్రిక - 9-6-2014