కిమ్ శర్మ
Appearance
కిమ్ శర్మ | |
---|---|
జననం | జనవరి 21, 1980 |
వృత్తి | బాలీవుడ్ నటి, ప్రచార కర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2000 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | వివేక్ సింగ్ |
కిమ్ శర్మ ప్రముఖ బాలీవుడ్ నటి,[1] ప్రచార కర్త. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కు కజిన్ అయిన కిమ్ శర్మ, ఆదిత్య చోప్రా సహకారం తో మొహబతీన్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. 2002లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం చిత్రం తో తెలుగు తెరకు పరిచయమయింది.
జననం
[మార్చు]కిమ్ శర్మ 1980, జనవరి 21న అహ్మద్ నగర్ లో జన్మించింది. కిమ్ తండ్రి భారతీయుడు, తల్లి జపాన్ దేశస్థురాలు.[2]
తొలిజీవితం
[మార్చు]ముంబై ఒక పర్యటనలో భాగంగా క్లోజప్ టూత్ పేస్టు ప్రచార చిత్రంకోసం కిమ్ శర్మను ఎంపిక చేశారు. తర్వాత ఆమె సన్ సిల్క్, పెప్సి, టాటా సఫారి, పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, క్లీన్-ఎన్-క్లియర్, లిరిల్ ప్రకటనలలో నటించింది. ఆదిత్య చోప్రా సహకారంతో తొలిసారిగా మొహబతీన్ చిత్రంలో నటించింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]- డర్ (1993) - అతిథి
- మొహబతీన్ (2000) - సంజన
- ఫిదా (2004) - సోనియా
- తుమ్ సే అఛ్చా కౌన్ హై (2002) - బాబీ గుజ్రాల్
- నెల్లే పే డెల్హా (2007) - కిమ్ (పూజా స్నేహితురాలు)
- యాగం (2010) - సోఫీ
- ఖడ్గం (2002)- పూజా
- టాం, డిక్ అండ్ హర్రీ (2006) - బాల్జీ
- మనీ హై తో హనీ హై (2008) - సారా
- కెహ్తా కహై దిల్ బార్ బార్ (2002) - రితూ పటేల్
- యాకీన్ (2005) - తన్యా ఠాకూర్
- ఆంజనేయులు (2009) - ప్రత్యేక పాట
- చోద్ధన్ న యార్ (2007) - రశ్మీ
- కుదియాన్ కా హై జమానా (2006) - కనిక
- తాజ్ మహాల్: ఎన్ ఎటెర్నల్ లవ్ స్టోరీ (2005) - లాడ్లీ బేగం
- పద్మశ్రీ లాలూ ప్రసాద్ యాదవ్ (2005) - రితా
- జిందగీ రాక్స్ (2006) - జాయ్
- మగధీర (2009) ప్రత్యేక పాత్రలో
మూలాలు
[మార్చు]- ↑ టైమ్స్ ఆఫ్ ఇండియా. "Kim Sharma: New vegan on the block". Retrieved 6 May 2017.
- ↑ టాలివుడ్ టైమ్స్. "కిం శర్మ". www.tollywoodtimes.com. Archived from the original on 23 డిసెంబరు 2013. Retrieved 6 May 2017.
వికీమీడియా కామన్స్‌లో Kim Sharmaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.