కిరాక్ పార్టీ
కిరాక్ పార్టీ | |
---|---|
దర్శకత్వం | కొప్పిశెట్టి శరణ్ |
రచన | మొండేటి చందు (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | సుధీర్ వర్మ |
కథ | రిషబ్ శెట్టి |
నిర్మాత | సుంకర రంభ్రహ్మం, అభిషేక్ అగర్వాల్ |
తారాగణం | నిఖిల్ సిద్ధార్థ్ సిమ్రన్ పరింజా సమ్యుక్తా హేగ్డే |
ఛాయాగ్రహణం | అద్వైతా గురుమూర్తీ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | బి. అజనీష్ లోక్‌నాథ్ |
నిర్మాణ సంస్థ | ఏ.కే. ఎంటర్‌టేన్మెంట్స్ |
విడుదల తేదీ | 2018 మార్చి 16[1] |
సినిమా నిడివి | 165 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | est. ₹6.9 కోట్లు[2] (తొలిరోజు కలెక్షన్) |
కిరాక్ పార్టీ 2018 మార్చి 16 శుక్రవారం విడుదలైన తెలుగు సినిమా. ఈ చలన చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రన్ పరింజా, సమ్యుక్తా హెగ్డే ప్రధాన పాత్రలు పొషించారు. ఈ చిత్రం 2016లో విడుదలై ఘన విజియాన్ని సాధించిన కన్నడ చిత్రం "కిరిక్ పార్టి"కి పునఃనిర్మాణం.
కథ
[మార్చు]కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ్) మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి. తన మిత్రులతో కలిసి కాలేజ్ జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. కాలేజ్ బంక్ కొట్టడం, గొడవలు చేయటం ఇదే కృష్ణ జీవితం. ఆ సమయంలో సీనియర్ మీరా (సిమ్రాన్ పరీన్జా) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఎలాగైన తనకు దగ్గరకావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా తన జీవితాన్ని తాను ఇష్టపడే చేసే కృష్ణను మీరా కూడా ఇష్టపడుతుంది. కానీ అనుకోండా ఓ ప్రమాదంలో మీరా చనిపోతుంది. మీరాను ప్రాణంగా ప్రేమించిన కృష్ణ, పూర్తిగా మారిపోతాడు. కాలేజ్‌లో అందరితో గొడవపడుతూ రౌడీలా మారిపోతాడు. మూడేళ్లు గడిచిపోతాయి. కృష్ణ బృందం తుది సంవత్సరం చదువుతుంటుంది. కృష్ణ హీరోయిజం చూసి జూనియర్ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను ఇష్టపడుతుంది. ఎలాగైన కృష్ణను మామూలు మనిషిగా మార్చాలని, జీవితంలోని కొన్ని చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ముందుకు సాగాలని గుర్తు చేయాలనుకుంటుంది. మరి సత్య ప్రయత్నం ఫలించిందా..? కృష్ణ మీరాను మర్చిపోయి సత్యకు దగ్గరయ్యాడా..? ఈ కాలేజ్ జీవితం కృష్ణకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది..? అన్నదే మిగతా కథ.
తారాగణం
[మార్చు]- కృష్ణగా నిఖిల్ సిద్ధార్థ్
- మీరాగా సిమ్రన్ పరింజా
- సత్యగా సంయుక్త హెగ్డే
- అర్జున్‌గా రాకేందు మౌళి
- అప్పుగా వైవా రాఘవ్
- జాన్‌గా సమీర్ మల్లా
- మౌర్యాగా సిద్దవరం మౌర్యా
- వినయ్‌గా అడుసుమిల్లి కార్తిక్
- పండు/కార్ ఓనర్/మెకానిక్ గా బ్రహ్మాజీ
- డా. శీనివాస మూర్తీ/కళాశాల ప్రింసిపల్గా హనుమంత గౌడా
- వార్డెన్‌గా కారుమంచి రఘు
- దీపుగా దీప్తీ సునైనా
- సున్నీగా నవీన్ సుంకర
- రెడ్డిగా వైవా సుహాస్
- కృష్ణ తండ్రిగా సాయాజీ షిండే
- విజయగా ఆరొహితా గౌడా
- బన్నీ అభిరామ్
పాటల జాబితా
[మార్చు]- గురువారo, రచన: రాకేందు మౌళి, గానం.విజయ్ ప్రకాష్
- డుందరే డుందరే, రచన: వనమాలి, గానం. హరిచరన్
- లాస్ట్ బెంచి, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. శశాంక్ శేషగిరీ , చింతన్ వికాస్, వరుణ్ రామచంద్ర
- సార్ బెవార్సే, రచన: రాకేందు మౌళి, గానం. శశాంక్ శేషగిరి
- నీచమైన, రచన: రాకేందు మౌళి, గానం. వశిష్ఠ ఎన్, సింహా
- నీలో నన్ను, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. శ్రేయా ఘోషల్
- ప్రాణమంత , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.కాల భైరవ,
- మీరాస్ థీమ్ , రచన: రాకేందు మౌళి, గానం. సమీరా భరద్వాజ్
- డం దరే , రచన: వనమాలి , గానం.బి.అజనేష్ లోకనాద్
సాంకేతికవర్గం
[మార్చు]- సంగీతం : బి. అజనీష్ లోక్‌నాథ్
- దర్శకత్వం : శరన్ కొప్పిశెట్టి
- నిర్మాత : రామబ్రహ్మం సుంకర