కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు పైళ్ల శేఖర్ రెడ్డి
నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1961 ఫిబ్రవరి 8
వలిగొండ, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బీఆర్​ఎస్​
తల్లిదండ్రులు కుంభం శ్రీనివాస్ రెడ్డి
జీవిత భాగస్వామి కిరణ్ జ్యోతి
సంతానం అనిల్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి
నివాసం ఇంటి. నెం. 8-2-293/82/A/493, ప్లాట్ నం.493, రోడ్డు నం.22, జూబ్లీహిల్స్, హైదరాబాద్

కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో 24063 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2022లో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడై[2], 2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నుండి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో విభేదాల కారణంగా 2023 జులై 24న కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరాడు.[3]

కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిన ఆయన రెండు నెలల కాలంలోనే తిరిగి సెప్టెంబర్ 25న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4][5] ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిపై 26201 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[6][7][8]

మూలాలు[మార్చు]

  1. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhrajyothy (11 December 2022). "టీపీసీసీ కార్యవర్గం నుంచి.. కోమటిరెడ్డి ఔట్‌". Archived from the original on 15 February 2024. Retrieved 15 February 2024.
  3. Andhrajyothy (24 July 2023). "బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కీలక నేత.. పదవి తీసుకొని పనిచేయమని కోరిన సీఎం కేసీఆర్." Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.
  4. 10TV Telugu (25 September 2023). "బీఆర్ఎస్‌లో చేరిన 2 నెలలకే.. మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న కీలక నేత" (in Telugu). Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. The Hindu (25 September 2023). "Kumbham Anil set to return to Congress just 2 months after joining BRS" (in Indian English). Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.
  6. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  7. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  8. "Election Commission of India - Bhongir". 6 December 2023. Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.