కుకునూరుపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుకునూరుపల్లి మండలం తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, సిద్ధిపేట రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండల కేంద్రం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై 27న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబర్ 26న నూతనంగా కుకునూరుపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[1][2]

సిద్దిపేట జిల్లాలో మొత్తం 24 మండలాలు కాగా, కుకునూర్‌పల్లి, అక్బర్‌పేట-భూంపల్లి(ఎక్స్‌రోడ్డు) మండలాలను ఏర్పాటు చేయడంతో మొత్తం మండలాల సంఖ్య 26కు చేరింది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

కొండపాక మండలంలోని 11 గ్రామాలు, జగదేవ్‌పూర్‌ మండలంలోని ఐదు గ్రామాలతో మొత్తం 16 గ్రామాలతో కుకునూరుపల్లి నూతన మండలంగా ఏర్పాటైంది.

  1. కుకునూరుపల్లి
  2. మంగోల్‌
  3. తిప్పారం
  4. సింగారం
  5. ఎర్రవల్లి
  6. ముద్దాపూర్‌
  7. లకుడారం
  8. మేదినీపూర్‌
  9. తిమ్మారెడ్డిపల్లి
  10. మాత్‌పల్లి
  11. కోనాయిపల్లి
  12. చిన్నకిష్టాపూర్‌
  13. రామచంద్రనగర్‌
  14. రాయవరం
  15. వెంకటాపూర్‌
  16. ఎల్లాయగూడ

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  2. Andhra Jyothy (26 September 2022). "మరో రెండు కొత్త మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.