అక్షాంశ రేఖాంశాలు: 17°58′23″N 78°51′30″E / 17.972957°N 78.858426°E / 17.972957; 78.858426

కొండపాక మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండపాక మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°58′23″N 78°51′30″E / 17.972957°N 78.858426°E / 17.972957; 78.858426
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం కొండపాక
గ్రామాలు 29
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,592
 - పురుషులు 24,216
 - స్త్రీలు 24,376
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.59%
 - పురుషులు 60.29%
 - స్త్రీలు 32.75%
పిన్‌కోడ్ {{{pincode}}}

కొండపాక మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. కొండపాక ఈ మండలానికి కేంద్రం.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 48,592, పురుషులు 24,216, స్త్రీలు 24,376. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేమీ మారలేదు. మండల వైశాల్యం 228 చ.కి.మీ. కాగా, జనాభా 48,592. జనాభాలో పురుషులు 24,216 కాగా, స్త్రీల సంఖ్య 24,376. మండలంలో 10,922 గృహాలున్నాయి.[3]

కొండపాక రుద్రేశ్వరాలయం

[మార్చు]

దాదాపు 900 సం.ల. క్రితం కొండపాకలో నిర్మితమైన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైందిగా పేర్గాంచింది. సా.శ.1094వ సంవత్సరంలో మొదటి కాకతీయ రుద్రదేవుడు, తన పరిపాలనాకాలంలో,కాకతీయ సామ్రాజ్యం నలుదిశలా రుద్రేశ్వరస్వామికి పలు ఆలయాలను నిర్మింపజేశాడు. ఆ పరంపరలోనిదే ఈ కొండపాక రుద్రేశ్వరాలయం.[4] 14, 15, 2006 అక్టోబరు 16లో స్థానిక రుద్రేశ్వరాలయ ప్రాంగణంలోనే బ్రహ్మశ్రీ శ్రీరామ సిద్ధాంతిగారి శతజయంతి ఉత్సవాలు జరిగాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. ఈనాడు మెదక్, 14 అక్టోబరు 2013. 9వ పేజీ

బయటి లింకులు

[మార్చు]