కృష్ణ కుమార్ బిర్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ కుమార్ బిర్లా
కృష్ణ కుమార్ బిర్లా
జననంకృష్ణ కుమార్ బిర్లా
నవంబర్ 11, 1918
మరణంఆగష్టు 30, 2008
ఇతర పేర్లుకె కె బాబు
ప్రసిద్ధిసుప్రసిద్ధ పారిశ్రామికవేత్త

కె.కె.బిర్లాగా ప్రసిద్ధిచెందిన డా. కృష్ణ కుమార్ బిర్లా (నవంబర్ 11, 1918 - ఆగష్టు 30, 2008) బిర్లా కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త. కృష్ణ కుమార్ బిర్లా కంటే కె కె బాబు గానే ఆయన అందరికి పరిచయస్తుడు. ఘణశ్యామ్ దాస్ బిర్లా పెద్ద కొడుకు అయిన కె.కె.బిర్లా రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేసారు. 1990లో భారత ప్రభుత్వము ప్రవేశపెట్టబోయిన ఆర్థిక సంస్కరణలను సమర్ధించిన కొద్దిమంది పారిశ్రామికవేత్తలలో ఈయన ఒకరు. 1991లో హిందీ సాహిత్యాన్ని ప్రోత్సహించుటకు కె కె బిర్లా సంస్థను స్థాపించారు. ప్రతిష్ఠాత్మక బిట్స్ పిలానికి ఛాన్సలర్ (సంచాలకుని) గా కూడా పనిచేసి ఉన్నారు.

నలభైకి పైగా కంపెనీలు కె కె బిర్లా గ్రూపు ఛత్రంలో ఉన్నాయి. చక్కెర, ఎరువులు, భారీ ఇంజనీరింగ్, వస్త్రాలు, నౌకా రవాణా, వార్తా పత్రికలు వంటి విభిన్న రంగాల్లో కె కె బిర్లా ప్రవేశించి ప్రభావితం చేసారు.

వీరి కుమార్తె పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభనా భార్తియా.