Jump to content

కృష్ణ పాల్ సింగ్ యాదవ్

వికీపీడియా నుండి
కృష్ణ పాల్ సింగ్ యాదవ్

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు జ్యోతిరాదిత్య సింధియా
తరువాత జ్యోతిరాదిత్య సింధియా
నియోజకవర్గం గునా

వ్యక్తిగత వివరాలు

జననం (1976-01-15) 1976 జనవరి 15 (వయసు 48)[1]
అశోక్‌నగర్, మధ్యప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం రుసల్లా, అశోక్‌నగర్ , మధ్యప్రదేశ్, భారతదేశం
పూర్వ విద్యార్థి భావు ములక్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం, నాగ్‌పూర్
వృత్తి రాజకీయ నాయకుడు, ఆయుర్వేద వైద్యుడు

కృష్ణ పాల్ సింగ్ యాదవ్ (జననం 15 జనవరి 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గునా నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

కృష్ణ పాల్ సింగ్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి జ్యోతిరాదిత్య సింధియాకు సన్నిహితుడిగా ఉన్నాడు అయితే 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముంగవోలి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీని విడి భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గునా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియాపై 1,25,549 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయనకు 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 13 September 2019.
  2. Deccan Herald (28 May 2019). "K P Yadav: The one who defeated the 'Maharaja'" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  3. "Guna Election Results 2019: BJP's Krishna Pal Singh wins" (in ఇంగ్లీష్). 23 May 2019. Retrieved 7 August 2024.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  5. India Today (23 June 2019). "Mocked for selfie with Jyotiraditya Scindia, Guna MP takes another one with PM Modi" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  6. The South First (3 March 2024). "Lok Sabha 2024: BJP drops 33 sitting MPs in first list, new faces replace them" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.