Jump to content

చిత్రదర్శిని(Kaleidoscope)

వికీపీడియా నుండి
(కెలిడియోస్కోప్ నుండి దారిమార్పు చెందింది)

చిత్రదర్శిని అనేది సిలెండరు ఆకారం కలిగివుంటుంది. అందులో గాజు ముక్కలు,రకరకాల,రంగుల పూసలు వుంటాయి.వీక్షకుడు ఒక వైపు నుండి చూస్తే ఇతర కాంతి కిరణాలు అద్దాల మీద పడటం వల్ల జరిగే పరావర్తనము ఒక రంగుల నమూనాను సృష్టిస్తుంది.

నమూనా

[మార్చు]

చిత్రదర్శిని, బహుళ పరావర్తనము నియమము పై ఆధారపడి ఉంటుంది.చిత్రదర్శినిలో అద్దాలను ఒక దానితో ఒకటి కొంత కోణాన్ని చేసేటట్టు ఏర్పాటు చేస్తారు(సామాన్యంగా 600 ల కోణం ). సాధారణంగా చిత్రదర్శినిలో మూడు అద్దాలను 600 కోణంలో పెట్టినప్పుడు అవి ఒక సమబాహు త్రిభుజము ఏర్పడుతుంది.ఈ600 కోణం 7 నకిలి ప్రతిబింబాలను సృష్టిస్తుంది. గొట్టాన్ని తిప్పినప్పుడు ఆ రంగుల వస్తువులు వివిధ నమూనాలను ఏర్పరుస్తుంది.అనియంత్రిత నమూనాలు పరావర్తనముల వలన అందమైన సుష్ట నమూనాలుగా కనిపిస్తాయి. ఆధునిక చిత్రదర్శినిలను ఇత్తడి గొట్టాలతో,చెక్క,ఉక్కు మొదలైన వాటితో చేస్తున్నారు.వస్తువులను చూడడానికి ఎక్కడైతే ఉంచుతామో దానిని వస్తువు చాంబర్' లేదా 'వస్తువు సెల్' అంటారు.

చరిత్ర

[మార్చు]

సర్ డేవిడ్ బ్రూవ్స్టర్ 1815 లో చిత్రదర్శినిని కనుగొన్నడు.అతను 1817 లో ఫిలిప్ కార్పెంటర్ ని తన భాగస్వామిగా చేసుకుని రెండు వందల వేల చిత్రదర్శిని లను అమ్మారు.దీనిని తర్వాత శాస్త్రపయోగ వస్తువుగా కాకుండా ఆట వస్తువుగా వాడటం మొదలైంది.

ప్రచురణలు

[మార్చు]

Cozy Baker-The Brewster Kaleidoscope Society వ్యవస్థాపకుడు చిత్రదర్శిని లను పోగుచేసి, వాటిని కళాకారులు ఎలా తయారుచేస్తారో పుస్తకాలను రచించారు. ఆ పుస్తకాలలో ఒకటి Kaleidoscope Artistry.చిత్రదర్శిని ల గురించి సంచికలు కుడా వెలువడుతాయి.దాని పేరు The New Kaleidoscope.

పరిశ్రమ

[మార్చు]

చిత్రదర్శిని లను ఎక్కువగా తక్కువ ఖర్చు అయ్యే పదార్ధాల నుండి తయారుచేస్తారు.వీటిని యెక్కువగా చిన్న పిల్లల ఆట బొమ్మలగా వాడతారు.

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయట లంకెలు

[మార్చు]