కె.ఆనందరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనందరాజు
జననం(1893-09-21)1893 సెప్టెంబరు 21
చెన్నై,బ్రిటిష్ ఇండియా
మరణం1966 జనవరి 22(1966-01-22) (వయస్సు 72)
ముంబై, ఇండియా
జాతీయతభారతీయుడు
జాతితమిళం
రంగములుగణితశాస్త్రం
విద్యాసంస్థలుప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు
చదువుకున్న సంస్థలుప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు
పరిశోధనా సలహాదారుడు(లు)జి.హెచ్.హార్డీ
ప్రసిద్ధిsummabilty of series, theory of functions of a complex variable and sums of an even number of squares

కె.ఆనందరావు (21 సెప్టెంబరు 1893 – 22 జనవరి 1966)  ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆయన శ్రీనివాస రామానుజన్ కన్నా 6 సంవత్సరాలు చిన్నవాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆనందరావు తాను చదివిన ఉన్నత పాఠశాలలో రామానుజన్ కంటే ముందు వరుసలో ఎడమ వైపు కూర్చున్నారు.

ఆనందరావు సెప్టెంబరు 21 1883 న మద్రాసులో జన్మించారు.ఆయన మద్రాసు నందలి ట్రిప్లికేన్ లో హిందూ స్కూల్ నందు ప్రాథమికవిద్యనభ్యసించాడు.ఆయనప్రెసిడెన్సీ కాలేజి (మద్రాసు) లో చదివారు. ఆయన ప్రతిభ ఆధారంగా రామానుజన్ వెళ్ళిన కొన్నినెలల తరువాత 1914 లో ఇంగ్లాండు వెళ్ళాడు. 1916లో కేంబ్రిడ్జ్ కళాశాలలో గణిత ట్రైపోస్ పూర్తి చేసిన తరువాత అతను రామానుజన్ వలె ఫ్రొఫెసర్ హార్డీ పర్యవేక్షణలో క్రియాశీలక పరిశోధనలు ప్రారంభించాడు. కేంబ్రిడ్జ్ వద్ద రాజు, రామానుజన్ మంచి స్నేహితులయ్యారు. రామానుజన్ "ఎక్కువగా ఆరాధించే స్నేహితుడు" రామచంద్రరావు జిల్లా కలెక్టరుగా ఉండేవాడు. అతను కూడా ఆనందరావు బంధువు. రామచంద్రరావు రామానుజన్ పరిశోధనలను పర్యవేక్షిస్తూ ఆర్థిక సహాయం అందిచడమే కాక అతని ఆర్థిక అవసరాల కొరకు మద్రాసు పోర్టు ట్రస్టులో ఉద్యోగం యిప్పించాడు. ఆనందరావు మొట్టమొదటి సారిగా రామానుజన్ ను ఇంగ్లాడులో కలిసినా రామానుజన్ గూర్చి తన బంధువు రామచంద్రరావు మూలంగా తెలుసుకున్నాడు.

విద్యార్థిగా ఆనందరావు హార్డీ పర్యవేక్షణలో వ్రాసిన వ్యాసానికి 1917లో స్మిత్ ప్రైజ్ తెచ్చిపెట్టింది. తరువాత అతను కింగ్స్ కళాశాల ఫెలోషిప్ కు ఎంపిక కాబడ్డాడు. హార్డీతో పనిచేస్తూ అతను "సమ్మబిలిటీ", అనంత శ్రేణూల కన్వెర్జన్స్ నియమాలపై కృషి చేసాడు. దాని ఫలితంగా హార్డీ పుస్తకంలో రావు పేరుతో ఒక సిద్ధాంతం ఉంది. అతను అనేక పత్రాలను ప్రచురించాడు. అవి మూడు రంగాలలో ఉండేవి. అవి:సమ్మబిలిటీ సిరీస్, థీయరీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ వారియబుల్ అండ్ సంస్ ఆఫ్ ఎన్ ఈవెన్ నంబర్ ఆఫ్ స్క్వేర్స్.

1919లో అతను భారత దేశానికి తిరిగి వచ్చి తన 26వ యేట ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్ గా చేరాడు. తరువాత అదే కళాశాలకు ప్రధానాధ్యాపకునిగా పనిచేసి 1948న పదవీ విరమణ చేసాడు. అతని భార్య పిన్న వయసులోనే 1928లోనూ, కుమార్తె 1940లో మరణించారు. తాను అనేక రుగ్మతలను లోనయ్యాడు. వాటిలో ఒక కన్నుకు చూపు పోయింది. అతను 1966 జనవరి 22న తన 72వ యేట మరణించాడు.

అతను సుప్రసిద్ధ గణితశాస్త్రవేత్తలైన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, కె.ఎస్.చంద్రశేఖర్, ఎస్. మీనాక్షి సుందరం, సి.టి.రాజగోపాల్, సి.ఎస్.వెంకిటరామన్, ఎం.వి.సుబ్బారావు వంటివారికి గురువు.


మూలాలు[మార్చు]

  • Rajagopal, C. T. (1969), "K. Ananda-Rau", Journal of the London Mathematical Society. Second Series, 44: 1–6, doi:10.1112/jlms/s1-44.1.1, ISSN 0024-6107, MR 0230592
  • కె.ఆనందరావు at the Mathematics Genealogy Project