కె.ఎస్.చంద్రశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.ఎస్.చంద్రశేఖర్
జననం (1920-11-21) 1920 నవంబరు 21 (వయసు 103)
బాపట్ల, గుంటూరు జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్)
నివాసంజురిచ్ ఏరియా
పౌరసత్వంఇండియా-స్విస్
జాతిఆసియన్
రంగములునంబర్ థియరీ
వృత్తిసంస్థలుTIFR, ఎడ్జినోసిచ్ టెక్నిస్కె హన్‌షూల్ జూరిచ్
చదువుకున్న సంస్థలుమద్రాసు విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)కె.ఆనందరావు
డాక్టొరల్ విద్యార్థులుసి.ఎస్.శేషాద్రి
ఎం.ఎస్.నరసింహన్
ప్రసిద్ధిAdministrative intellect
ముఖ్యమైన పురస్కారాలురామానుజన్ మెడల్ 1966,పద్మశ్రీ 1959, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు 1963,

కొమరవోలు ఎస్.చంద్రశేఖర్ (జననం 1920 నవంబరు 21) [1] భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆయన ఎడ్జినోసిచ్ టెక్నిస్కే హన్‌షూల్ జూరిచ్ లో ప్రొఫెసర్.[2] ఆయన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) లో వ్యవస్థాపక సభ్యులు. ఆయన "నంబర్ థియరీ", "సమ్మబిలిటీ" లలో ప్రసిద్ధుడు. ఆయనకు ప్రతిష్ఠాకరమైన అవార్డులైన "పద్మశ్రీ", "శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు", "రామానుజన్ మెడల్", టి.ఐ.ఎఫ్.ఆర్ లో గౌరవ ఫెలో వంటి అవార్డులు వచ్చాయి.

జీవిత విశేషాలు[మార్చు]

చంద్రశేఖర్ 1920 నవంబరు 21 న కొమరవోలు రాజయ్య, పద్మాక్షమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయులు. చంద్రశేఖర్ పాఠశాల విద్యను గుంటూరు జిల్లాలోని బాపట్లలో పూర్తిచేసారు. ఆయన చెన్నైలో గల ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎస్.సి (గణితశాస్త్రం) లో పూర్తిచేసారు. 1942లో మద్రాసు విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగం నుండి పి.హెచ్.డి పట్టాను పొందారు.ఆయన కె.ఆనందరావు ఆధ్వర్యంలో పి.హెచ్.డి.ని పూర్తిచేసారు.

చంద్రశేఖర్ యు.ఎస్.ఎ లోని ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ, ప్రిన్సిటన్ లో ఉన్నప్పుడు హోమీ భాభా ఆయనను గణితశాస్త్ర పాఠశాల అయిన "టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్"కు ఆహ్వానించారు. ఆయన ఆ సంస్థలో అనేక విషయాలను బోధించారు. 1965 లో హోమీ భాభా మరణానంతరం చంద్రశేఖర్ ఆ సంస్థను వదలి ఎడ్జినోసిచ్ టెక్నిస్కే హన్‌షూల్ జూరిచ్ లో చేరి 1988 లో పదవీవిరమణ చేసారు.[3][4]

2012 లో ఆయనకు అమెరికన్ మేధమెటికల్ సొసైటీలో ఫెలోషిప్ లభించింది.[5]

ఉద్యోగ జీవితం[మార్చు]

ఆయన "టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్"లో సీనియర్ ప్రొఫెసర్ గా, డిప్యూటీ డైరక్టరుగా (1949-55), పనిచేసారు. కేంద్రప్రభుత్వ సైంటిఫిక్ అడ్వయిజరీ కమిటీకి ప్రధాన సలహాదారుగా (1961-66), ఉన్నారు. ఇంటర్నేషనల్ మేధమెటికల్ యూనియన్ కు ఉపాధ్యక్షులుగా (1963-66), ప్రధాన కార్యదర్శిగా (1966-70) ఉన్నారు. 1965 లో జ్యూరిచ్ లోని స్విచ్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ గా పనిచేసారు.

ప్రసిద్ధ రచనలు[మార్చు]

 • with Salomon Bochner: Fourier Transforms. Princeton University Press. 1949.[6]
 • with S. Minakshisundaram: Typical means. Oxford University Press. 1952.[7]
 • Introduction to analytic number theory. Springer. 1968.[8] reprinting 2012
 • Arithmetical Functions. Grundlehren der Mathematischen Wissenschaften. Springer. 1970.[8]
 • Elliptic Functions. Springer. 1985.
 • Classical Fourier transforms. Springer-Verlag. 1989.
 • Course on topological groups. Hindustani Book Agency. 2011.

మూలాలు[మార్చు]

 1. "Some Famous Indian Scientists" (PDF). Mumbai, India: Tata Institute of Fundamental Research, Science Popularisation and Public Outreach Committee. 2004-11-14. p. 12. Retrieved 2009-05-26.
 2. Komaravolu Chandrashekhar
 3. "Department of Mathematics Retired Faculty". Eidgenössische Technische Hochschule Zürich. 4 February 2005. Retrieved 2009-05-26.
 4. "ETHistory Selbstständige Professuren" (in German). Eidgenössische Technische Hochschule Zürich. 2005. Archived from the original on 2011-06-13. Retrieved 2009-05-26.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 5. List of Fellows of the American Mathematical Society, retrieved 2012-11-10.
 6. Segal, I. E. (1950). "Review: Fourier transforms, by S. Bochner and K. Chandrasekhar" (PDF). Bull. Amer. Math. Soc. 56 (6): 526–528. doi:10.1090/s0002-9904-1950-09436-1.
 7. Kuttner, B. (1954). "Review: Typical means, by K. Chandrasekhar and S. Minakshisundaram" (PDF). Bull. Amer. Math. Soc. 60 (1): 85–88. doi:10.1090/s0002-9904-1954-09760-4.
 8. 8.0 8.1 Stark, H. M. (1971). "Review: Introduction to analytic number theory, by K. Chandrashekhar; Arithmetical functions, by K. Chandrashekhar; Multiplicative number theory, by Harold Davenport; Sequences, by H. Halberstam and K. F. Roth" (PDF). Bull. Amer. Math. Soc. 77 (6): 943–957.

ఆధారాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]