కె.ఎన్.రాజ్
కక్కడన్ నందనాథ్ రాజన్ (1924 మే 13 - 2010 ఫిబ్రవరి 10) భారతీయ ఆర్థికవేత్త. ఆయన భారతదేశం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన భారతదేశం మొదటి పంచవర్ష ప్రణాళిక విభాగాలను రూపొందించాడు. అప్పటికి ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు. ఆయన ప్రణాళికా సంఘంలో అనుభవజ్ఞుడైన ఆర్థికవేత్త. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో దేశానికి విదేశీ సహాయం అవసరమైనప్పుడు భారతదేశ పొదుపు రేటును పెంచడానికి అతను ఒక ప్రణాళికను రూపొందించాడు. అతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం భారతదేశం చెల్లింపుల బ్యాలెన్స్‌ను మొదటిసారిగా లెక్కించాడు. ఆయన జవహర్‌లాల్ నెహ్రూ నుండి పి.వి నరసింహారావు వరకు అనేక మంది ప్రధానులకు సలహాదారుగా ఉన్నాడు.
డాక్టర్ కె.ఎన్.రాజ్ కీనేసియన్ ఆర్థికవేత్త. అతను భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని కీనేసియన్ ద్రవ్య సిద్ధాంతం (Keynesian monetary theory) అనువర్తనాన్ని అధ్యయనం చేశాడు.
జీవితం తొలి దశలో
[మార్చు]కె.ఎన్.రాజ్ త్రిసూర్ జిల్లాలో జన్మించాడు. ప్రతిష్టాత్మక మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి అతను బి.ఎ. పూర్తి చేసాడు. అతను అక్కడ ప్రముఖ ఆర్థికవేత్త మాల్కం ఆదిశేషయ్య శిష్యుడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉన్నత చదువులు చదవాలని అతని గురువు ఒత్తిడి చేశాడు. అతను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానంపై థీసిస్ రాసాడు. మన్మోహన్ సింగ్, అమర్త్యసేన్, జగదీష్ భగవతి వంటి ప్రముఖ ఆర్థికవేత్తలకు కె.ఎన్.రాజ్ సహచరుడు. అతను బలమైన వామపక్షవాది అయినప్పటికీ, అతను దేశం గురించి లెనిన్ ఆలోచనలను విమర్శించాడు. భారతదేశంలో ఆర్థిక సరళీకరణను ఆయన వ్యతిరేకించాడు.[1]
కెరీర్
[మార్చు]ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కె.ఎన్.రాజ్ ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. వైస్-ఛాన్సలర్ గా పదోన్నతి పొందిన ఆయన అక్టోబరు 1969 నుండి డిసెంబరు 1970 వరకు అక్కడ మొత్తం 18 సంవత్సరాలు విధులు నిర్వహించాడు. ఆ సమయంలో, అతను ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (DSE) ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు.
1971లో ఢిల్లీ నుండి కేరళకు తిరిగి వచ్చిన తర్వాత, ఆయన తిరువనంతపురంలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ (CDS)ను స్థాపించాడు, ఈ సంస్థ అప్లైడ్ ఎకనామిక్స్, సోషల్ సైన్స్ రీసెర్చ్‌లో అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. సిడిఎస్ ప్రారంభ రోజులలో ఆయన, అతని సహచరులు ఐక్యరాజ్యసమితి కోసం పనిచేసారు, ఇది 1976లో ప్రచురించబడింది. ఇది ఆ తర్వాత "కేరళ అభివృద్ధి నమూనా" రూపురేఖలను రూపొందించడంలో సహాయపడింది.
ఆర్థిక శాస్త్రం పేదలకు సహాయం చేయాలనే ఆత్రుతతో ఉందనే ఆయన తన జీవితాంతం ఆమ్ ఆద్మీ సంక్షేమం కోసం నిలబడ్డాడు.
అవార్డులు
[మార్చు]కె.ఎన్.రాజ్ ను 2000లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
మరణం
[మార్చు]కె.ఎన్.రాజ్ 2010 ఫిబ్రవరి 10న తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే విధానం - నయా ఉదారవాదం | Prajasakti". web.archive.org. 2023-02-07. Archived from the original on 2023-02-07. Retrieved 2023-02-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Economist K.N. Raj passes away".