జగదీశ్ భగవతి
జగదీష్ నట్వర్‌లాల్ భగవతి (జననం 1934 జూలై 26) భారతదేశంలో జన్మించిన, అమెరికన్ ఆర్థికవేత్త [1] [2] [3] కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర, న్యాయశాస్త్ర ప్రొఫెసర్ కూడా. [4] భగవతి పరిశోధనల్లో అంతర్జాతీయ వాణిజ్యం ఒక అంశం. అతను స్వేచ్ఛా వాణిజ్యాన్నిసమర్ధిస్తాడు. 2000లో పద్మవిభూషణ పురస్కారం పొందాడు.
జీవిత విశేషాలు
[మార్చు]భగవతి 1934 లో, బ్రిటిష్ పాలన లోని బొంబాయి ప్రెసిడెన్సీలో గుజరాతీ కుటుంబంలో జన్మించాడు. ముంబైలోని సిడెన్హామ్ కాలేజీ నుండి బికామ్ పట్టా పొందాడు. తరువాత అతను కేంబ్రిడ్జ్ లోని సెయింట్ జాన్స్ కాలేజీలో చదువుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు, 1956 లో కేంబ్రిడ్జ్ (ఎకనామిక్స్ లో) లో రెండవ బిఎ అందుకున్నాడు. 1957, 1959 మధ్య అతను ఆక్స్‌ఫర్డ్ లోని నఫీల్డ్ కాలేజీలో చదువుకున్నాడు. 1961 లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్‌డి పొందారు. చార్లెస్ పి. కిండ్లెబెర్గర్ పర్యవేక్షణలో "ఎస్సేస్ ఇన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్" అనే థీసిస్ కోసం అతనికి ఈ పిహెచ్‌డి వచ్చింది.
కొలంబియా విశ్వవిద్యాలయానికే చెందిన మరో ఆర్థికవేత్త, రష్యా-స్పెషలిస్టూ అయిన పద్మ దేశాయ్ ను భగవతి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది. భగవతి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి పిఎన్ భగవతి సోదరుడు. ప్రముఖ న్యూరో సర్జన్ అయిన ఎస్ఎన్ భగవతి సోదరుడు. భగవతి, దేశాయ్‌లు సంయుక్తంగా 1970 లో చేసిన ఓఇసిడి అధ్యయనం, ఇండియా:ప్లానింగ్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్ ఆ సమయంలో వెలువడ్డ ముఖ్యమైన కృషి. [5]
వృత్తిగత విశేషాలు
[మార్చు]పిహెచ్‌డి పూర్తి చేసిన తరువాత, భగవతి 1961 లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. మొదట కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌లో కొద్ది కాలం పాటు బోధించాడు. ఆపై 1962 నుండి 1968 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం లోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అంతర్జాతీయ వాణిజ్య ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1968 నుండి 1980 వరకు భగవతి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనామిక్స్ ప్రొఫెసరుగా పనిచేసాడు. [6] భగవతి ప్రస్తుతం అకాడెమిక్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాచ్ (ఆసియా) లోను, సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ పండితుల బోర్డులో పనిచేస్తున్నారు. అతను విదేశీ సంబంధాల మండలి యొక్క సీనియర్ ఫెలో. భగవతి 2001 లో ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌కు బాహ్య సలహాదారు గాను, 2000 లో ఐక్యరాజ్యసమితికి ప్రపంచీకరణపై ప్రత్యేక విధాన సలహాదారు గాను, 1991 నుండి 1993 వరకు. జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ డైరెక్టర్ జనరల్‌కు ఆర్థిక విధాన సలహాదారు గానూ పనిచేశాడు.
పురస్కారాలు, గౌరవాలు
[మార్చు]- ఇండియన్ ఎకోనొమెట్రిక్ సొసైటీ వారి మహాలనోబిస్ మెమోరియల్ మెడల్ (1974)
- అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (1982) యొక్క ఫెలో [7]
- ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకానమీలో సీడ్మన్ విశిష్ట అవార్డు (1998)
- పద్మ విభూషణ్ పురస్కారం (2000)
- ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క జీవితకాల సాధన అవార్డు (2004)
- ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్, గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్ (2006)
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;LevyBarfield2011
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Heilemann, John (August 1, 2004). "Gearing Ourselves for Globalization Free trade isn't the cause of the world's ills, says Columbia professor Jagdish Bhagwati. It's the best cure we have for them--if only we can stomach it". Fortune Magazine. Archived from the original on 2020-08-09. Retrieved 2020-06-27.
- ↑ Drezner, Daniel W. (August 18, 2004). "Review of "In Defense of Globalization" by Jagdish Bhagwati, New York: Oxford University Press".
- ↑ "Professor Jagdish Bhagwati Called Upon by World Leaders to Find Ways to Boost Global Trade". Law.columbia.edu. Archived from the original on 2014-05-10. Retrieved 2020-06-27.
- ↑ [1] Archived నవంబరు 22, 2010 at the Wayback Machine
- ↑ [2] Archived ఆగస్టు 3, 2004 at the Wayback Machine
- ↑ "Book of Members, 1780–2010: Chapter B" (PDF). American Academy of Arts and Sciences. Retrieved June 25, 2011.
- మూలాల లోపాలున్న పేజీలు
- AC with 16 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- భారతీయ ఆర్థిక శాస్త్రవేత్తలు
- 1934 జననాలు
- ఆర్థిక శాస్త్రవేత్తలు
- పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు