కె.జె.రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొమ్మాజోస్యుల జగన్నాధరావు‎
కొమ్మాజోస్యుల జగన్నాధరావు‎
జననం1942
జాతీయతభారతీయులు
వృత్తిసివిల్ సర్వెంటు, ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బీహార్ ఎన్నికల పరిశీలకులు

కొమ్మాజోస్యుల జగన్నాధరావు‎ భారత ఎన్నికల కమిషన్ పరిశీలకులు.[1] ఈయన 2005 లో బీహార్ లోజరిగిన ఎన్నికలకు పరిశీలకులుగా యున్నారు.[2][3] ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ఆయువు పట్టు . అలాంటి ప్రక్రియలో రాజకీయ నాయకుల అనుచిత ప్రమేయము మొత్తం వ్యవస్థకే శాపగ్రస్థం . ఇలాంటి అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా నిలిచిన ఘనత కె.జె.రావు గారిది . బీహార్ లాంటి ప్రమాదకర రాష్ట్రంలో ఎనికల ప్రక్రియను గాడిలో పెట్టిన ధీరుడాయన .

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన శ్రీకాకుళం జిల్లా లోని కొండలమామిడివలస గ్రామంలో మార్చి 1 1942 న జన్మించారు. ఆయన స్వగ్రామంలో విద్యాభ్యాసం చేశారు. ఆయన విశాఖపట్నం లోని ఎ.వి.ఎన్.కాలేజీలో 1959-62 లో "చరిత్ర" అంశంలో పట్టభద్రుడయ్యాడు.

ఈయన శ్రీకాకుళం జిల్లాలోని "జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మెట్టపల్లి"లో (ప్రస్తుతం ఈ పాఠశాల విజయనగరంలో కలదు) ఆగస్టు 1962 నుండి మార్చి 1963 వరకు అన్‌ట్రైన్డ్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆతర్వాత ఆయన మార్చి 1963 నుండి నవంబరు 1966 వరకు పూనే లోని డిఫెన్స్ ఆడిట్ డిపార్ట్ మెంటులో ఆడిటరుగా పనిచేశారు.

1965 లో యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష ఉత్తీర్ణుడయిన తర్వాత ఆయన 1966 నవంబరు 14 నుండి ఎన్నికలు కమిషన్ ఆఫ్ ఇండియాలో సర్వీసులో చేరారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో 2002 ఫిబ్రవరి 28 వరకు ఆయన భారత ఎన్నికల కమిషన్ సెక్రటరీగా పదవీవిరమణ చేయువరకు అనేక బాధ్యతలు నిర్వర్తించారు. 2002 మార్చి 1 నుండి 2004 ఫిబ్రవరి 29 వరకు ఆయన పదవి అనంతరం సేవలు కొనసాగించారు. తర్వాత ఆయన పరిశీలకులు (ఎన్నికలు, శిక్షణ) గా2006 ఫిబ్రవరి 28 వరకు యున్నారు.

ఆయన అక్టోబరు 2002 లో జమ్మూ, కాశ్మీర్ లో జరిగిన అతి క్లిష్టమైన సాధారన లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రాష్ట్రంలోనే ఉండి ప్రతి దశలో ఎన్నికలను నిర్వహించారు. అతను రాష్ట్రంలో ఈ సాధారణ ఎన్నికల అన్ని విషయాలతో సంబంధం కలిగి సక్రమంగా నిర్వహించారు.ఈ ఎన్నికల్లో తన సహకారం భారతదేశం యొక్క ఎన్నికల కమిషన్ ద్వారా అందుకున్నాడు.

ఉద్యోగిగా, రక్షణశాఖలో అడిటర్ గా, ఎన్నికల సంఘంలో చిరుద్యోగిగా ... అదే సంస్థలో కేంద్ర ఎన్నికల ప్రధాన సలహాదారుడుగా, అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకునిగా, గల్ఫ్ దేశాలకు ఎంఫోర్సుమెంట్ అధికారిగా, ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల శిక్షణ సభ్యుడిగా, పలు రాష్ట్రాలలో ఎన్నికల పరిశీలకునిగా ... ఇలా అంచెలంచెలుగా ఎదిగి జిలా కీర్తిని ఇనుమడింప జేసిన ఘంత ఆయన సొంతం . ప్రస్తుతము ఫౌండేషన్‌ ఫర్ అడ్వాంస్డ్ మేనేజ్ మెంట్ ఫర్ ఎలక్షన్‌ (ఫేమ్‌) సంస్థకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు . సుఫ్రీం కోర్ట్ ఈయనను ఢిల్లీలో అక్రమ కట్టాడాల నియంత్రణ కమిటీ సభ్యునిగా ఇటేవల నియమించింది .

కెరీర్[మార్చు]

కె.జె.రావు రాజీవ్ గాంఖీ 1989 లో పోటీ చేసిన అమేధీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల అవకతవకలపై యేర్పడిన పరిశీలనా కమిటీలో సభ్యులుగా యున్నారు. 2002 లో ఆయన పదవీవిరమణ చేసినప్పటికీ భారత ఎన్నికల కమిషన్ కు అనేక విధాలుగా సేవలందిస్తున్నారు[4] ఈయన పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల జాబితాలలో బోగస్ ఓట్లు తొలగించే కార్యక్రమంలో సహకారమందించారు[5]

2009 లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై వచ్చిన అభియోగాలను ఖండించాడు[6]

సూచికలు[మార్చు]

  1. "Andra Pradesh". hindu.com. Archived from the original on 2012-11-07. Retrieved 2013-09-08.
  2. Sahay, Anand Mohan (December 19, 2005). "K J Rao is Bihar's hero no. 1, Lalu is zero no. 1". rediff.com.
  3. Singh, Santosh (January 6, 2010). "K J Rao model to power Rahul's 'Mission Bihar'". indianexpress.com.
  4. "Election Committee pointsman K. J. Rao calls it a day". indiatimes.com. Archived from the original on 2010-11-03. Retrieved 2013-09-08.
  5. Our Political Bureau (January 6, 2006). "Bihar poll hero K J Rao to oversee Bengal elections". business-standard.com.
  6. Press Trust of India (Aug 7, 2009). "EVMs cannot be tampered: K J Rao". indianexpress.com.

యితర లింకులు[మార్చు]