Jump to content

కె.విజయరామారావు

వికీపీడియా నుండి
కె.విజయరామారావు
కె.విజయరామారావు


వాణిజ్యపన్నుల, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 అక్టోబర్ 1999 - 14 మే 2004

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
నియోజకవర్గం ఖైరతాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1938-02-03) 1938 ఫిబ్రవరి 3 (వయసు 86)
ఏటూరునాగారం, ములుగు జిల్లా, తెలంగాణ
మరణం 2023 మార్చి 13
అపోలో ఆస్పత్రి, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్
రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
నివాసం బంజారాహిల్స్‌, హైదరాబాద్

కె. విజయరామారావు (1938 ఫిబ్రవరి 3 - 2023 మార్చి 13) ఐ.పి.ఎస్.అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. అతను సి.బి.ఐ. డైరక్టరుగా పనిచేసాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

విజయరామారావు వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల‌ దాకా విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది. తాతగారు (అమ్మ నాన్న) కల్యాణరావు స్వాతంత్ర్య సమరయోధుడు. వెంకటగిరిలో చాలా పెద్ద భూస్వామ్య కుటుంబం.వెంకటగిరిలో విద్యాభ్యాసం అయిపోయాక పైచదువులకు మద్రాసు యూనివర్సిటీలో చేరాడు. బి.ఎ. ఆనర్స్‌ పూర్తవగానే 1958 అక్టోబరులో కరీంనగర్‌ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో లెక్చరర్‌ ఉద్యోగంలో చేరాడు. విశ్వనాథ సత్యనారాయణ ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండేవాడు. 1959 అక్టోబరు నాటికి ఐ.పి.ఎస్‌. ట్రైనీగా శిక్షణ పొంది చిత్తూరు ఏ.ఎస్పీ.గా చేరాడు. 1984 ఆగస్టు సంక్షోభం నాటికి ఇతను హైదరాబాద్‌ కమిషనర్‌గా ఉన్నాడు. సి.బి.ఐ. డైరెక్టర్‌గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు, ముంబై బాంబు పేలుళ్లు.. మొదలైన కేసులు దర్యాప్తు నిర్వహించాడు. సర్వీసులో ఉండగానే ఎల్‌.ఎల్‌.బి. పూర్తి చేశాడు. రిటైరైయిన తర్వాత పోలీస్‌ మాన్యువల్‌ రాశాడు. అధికార వికేంద్రీకరణ మీద నమ్మకం ఎక్కువ. తెదేపా పార్టీలో చేరాడు. ఖైరతాబాద్‌ నుంచి శాసన సభ్యుడిగా గెలిచాడు. శాసన సభ్యుడిగా ఎన్నికైన తొలిసారే మంత్రి పదవి (రోడ్లూ భవనాల శాఖ) దక్కింది.

రాజకీయ జీవితం

[మార్చు]

అతను 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పి.జనార్థనరెడ్డి పై విజయం సాధించాడు.[2] 2004 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున అదే నియోజకవర్గం నుండి పోటీ చేసినా ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పి.జనార్థనరెడ్డి విజయం సాధించాడు.[3] 2009 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి దానం నాగేందర్ చేతిలో ఓడిపోయాడు.[4]

భావాలు

[మార్చు]
  • ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు ఇతను డిగ్రీ చదువుతున్నాడు. తెలుగువాళ్లు ఎక్కడ చేరినా అదే మాట్లాడుకునేవాళ్లు. అతను చనిపోయాక అప్పటి ప్రధాని నెహ్రూ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాడు. అదీ మద్రాసు లేకుండా. 'ఈ ప్రకటనేదో కొన్నిరోజులు ముందు చేసి ఉంటే అతను మనకు దక్కేవారు కదా' అని అతను ఎంతో బాధపడ్డసందర్భాలు ఉన్నాయి.

మరణం

[మార్చు]

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 85 ఏళ్ల విజయరామారావు పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 మార్చి 13న తుది శ్వాస విడిచాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. May 31, CHARU LATA JOSHI; May 31, 1996 ISSUE DATE:; June 1, 1996UPDATED:; Ist, 2013 13:37. "CBI chief K. Vijaya Rama Rao to leave behind legacy as controversial as his remarkable career". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-08-16. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2021-08-16.
  3. "Andhra Pradesh Assembly Election Results in 2004". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2021-08-16.
  4. "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Archived from the original on 2020-02-02. Retrieved 2021-08-16.
  5. "మాజీ మంత్రి కె.విజయరామారావు కన్నుమూత | Former minister Vijayarama Rao passed away bbr". web.archive.org. 2023-03-13. Archived from the original on 2023-03-13. Retrieved 2023-03-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)