కె. రాజశేఖర్ బసవరాజ్ హిట్నాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. రాజశేఖర్ బసవరాజ్ హిట్నాల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు కరడి సంగన్న అమరప్ప
నియోజకవర్గం కొప్పళ

వ్యక్తిగత వివరాలు

జననం (1979-06-01) 1979 జూన్ 1 (వయసు 45)
హోస్పేట్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు బసవరాజ్ కుయ్యప్పనవర్, బసమ్మ
జీవిత భాగస్వామి రష్మీ (మ. 20 మార్చి 2006)
బంధువులు రాఘవేంద్ర హిట్నాల్
నివాసం 2/170, 02వ వార్డు హిట్నాల్, కొప్పల్, కర్ణాటక
మూలం [1]

కె. రాజశేఖర్ బసవరాజ్ హిట్నాల్ (జననం 1 జూన్ 1979) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజశేఖర హిట్‌నాల్‌ రాజకీయ నేపథ్యంమున్న కుటుంబం నుండి రాజకీయాలలోకి వచ్చాడు. ఆయన తండ్రి బసవరాజ్ హిట్నాల్ కొప్పల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా, సోదరుడు రాఘవేంద్ర హిట్నాల్ మూడుసార్లు కొప్పల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో తన సోదరుడు, తండ్రి ఎన్నికల్లో చురుగ్గా ప్రచారం చేసి, కొప్పల్ జిల్లా పంచాయతీ సభ్యుడిగా, జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా రెండేళ్లు పని చేసి 2023 శాసనసభ ఎన్నికల్లో హోస్పేట నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించగా, మరొకరికి టికెట్ దక్కడంతో ఆయన గెలుపుకు కృషి చేశాడు.

రాజశేఖర్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డా. బసవరాజ్‌ కావటార్‌పై 46,357 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. TV9 Bharatvarsh (6 June 2024). "कोप्पल लोकसभा सीट से जीतने वाले कांग्रेस के राजशेखर हितनाल कौन हैं, जानिए अपने सांसद को". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. India Today (13 July 2024). "Businessmen | In august company" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  3. TV9 Kannada (6 June 2024). "ಕೊಪ್ಪಳದಲ್ಲಿ ಡಾಕ್ಟರ್​ನ ಮಣಿಸಿದ ರಾಜಶೇಖರ್ ಹಿಟ್ನಾಳ್ ಬಳಿ ಎಷ್ಟಿದೆ ಆಸ್ತಿ ಗೊತ್ತಾ?". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024. {{cite news}}: zero width space character in |title= at position 20 (help)CS1 maint: numeric names: authors list (link)
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Koppal". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.