కొల్లి శ్రీనాథ్ రెడ్డి

వికీపీడియా నుండి
(కె. శ్రీనాథ్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కొల్లి శ్రీనాథ్ రెడ్డి[1]
K Srinath Reddy.jpg
జాతీయతభారతీయుడు
వృత్తివైద్యుడు
ప్రసిద్ధులుప్రజారోగ్యం

ఆచార్య కొల్లి శ్రీనాథ్ రెడ్డి, భారతీయ హృద్రోగ నిపుణుడు. భారత ప్రజారోగ్య సమాఖ్య అధ్యక్షుడు మరియు వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడు. వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షస్థానాన్ని వహించిన తొలి భారతీయుడు.[2] పద్మభూషణ పురస్కార గ్రహీత. ఇతని తండ్రి కె.వి.రఘునాథరెడ్డి కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి మరియు త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి. శ్రీనాథ్ రెడ్డి పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అతని వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశాడు.

సత్కారాలు, గుర్తింపులు[మార్చు]

  • 2003: పొగాకు వాడకం నియంత్రణలో అంతర్జాతీయ స్థాయిలో విశిష్టమైన నేతృత్త్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అవార్డు[3]
  • 2005: ప్రజారోగ్య రంగంలో విశిష్ట సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం.[4]
  • 2009: ఫ్యాకల్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యు.కె. యొక్క ఫెలోషిప్ [5]
  • 2012: లాసన్నె విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్
  • 2012: 2013- 2015 కాల వ్యవధికి ప్రపంచ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక.[6]
  • 2014: లండన్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ (మెడిసిన్) పట్టా[7]

మూలాలు[మార్చు]