కె వై నారాయణస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె వై నారాయణస్వామి
పుట్టిన తేదీ, స్థలం (1965-06-05) 1965 జూన్ 5 (వయసు 58)
Kuppur village near Masthi, Malur taluk, Kolar district, Karnataka
ముద్దు పేరుKYN
వృత్తిKannada Language Professor, Playwright & Poet
జాతీయతIndian
పూర్వవిద్యార్థిBangalore University
పురస్కారాలుKarnataka Sahitya Academy Award

కుప్పురు ఎల్లప్ప నారాయణస్వామి ప్రఖ్యాత కన్నడ కవి, పండితులు, విమర్శకులు,, నాటక రచయిత. వీరిని కె వై ఎన్ అని కూడా పిలుస్తారు. వీరు ప్రస్తుతం బెంగళూరు ఆర్ట్స్ కళాశాలలో కన్నడ ఆధ్యాపకులుగ పనిచేస్తునారు. వీరు కలవు, అనభిజ్ఞ శాకుంతల, చక్రరత్న, హులిసీరె,, వినుర వేమ వంటి అనేక ప్రఖ్యాత కన్నడ నాటకాలను రచించారు. కువెంపు రచించిన శూద్ర తపస్విని వీరు తెలుగు భాషలోకి అనువదించారు. ఆయన "కలవు" చిత్రానికి స్క్రీన్ ప్లే వ్రాసారు.[1]

ఆయన కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.[2] ఈ అవార్డును ప్రఖ్యాతి పొందిన "పంపభారత" అనే నాటకానికి పొందారు.

జీవిత విశేషాలు[మార్చు]

కెవైఎన్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన మాలూర్ తాలూకాలోని కుప్పూర్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మునియమ్మ, యాలప్ప. ఆయన పాఠశాల విద్యను మస్తిలో పూర్తిచేసారు. ఆ తరువాత బెంగళూరు వెళ్ళి బి.ఎ, ఎం.ఎ, ఎం.ఫిల్ లను పూర్తి చేసారు. ఆయన "నీరదీవెగె" అనే గ్రంథం పై పరిశోధన చేసి పి.హెచ్.డి పొందారు. ఆయన ప్రస్తుతం బెంగుళూరులో భార్య పిల్లలతో నివసిస్తున్నారు.

రచనలు[మార్చు]

నాటకాలు/నాటికలు[మార్చు]

 1. పంప భారత
 2. కలవు
 3. హులిసీరె
 4. మళె మాంత్రిక (రిచర్డ్ నాష్ నాటకంThe Rainmaker కు కన్నడీకరణ)
 5. అనభిజ్ఞ శాకుంతల
 6. చక్రరత్న
 7. మళెగలల్లి మదుమగళు (కువెంపు పుస్తకం ఆధారంగా)
 8. మనుష్య జాతి తానొందే వలం (కోటగనహళ్ళి రామయ్య, లక్ష్మీపతి కోలార్‌లతో కలిసి)
 9. వినుర వేమ
 10. కైవార నారేయణ
 11. శూద్ర తపస్వి (కువెంపు నాటకానికి తెలుగు అనువాదం)

సినిమాలు[మార్చు]

 1. ఆదికవి పంప (డాక్యుమెంటరీ, రచన)
 2. సూర్యకాంతి (స్క్రీన్ ప్లే)
 3. కలవు (కథ, స్క్రీన్ ప్లే)

ఇతర రచనలు[మార్చు]

 1. నీరదీవిగె (పరిశోధన)
 2. ఆడువ గిళియోందరలి సమ్మ (కవిత్వం)
 3. తలపరిగె
 4. బారమ్మ భాగీరథి
 5. బాహుబలి
 6. నెనవ పరి

మూలాలు[మార్చు]

 1. http://www.imdb.com/title/tt2913910/
 2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-12-08.

ఇతర లింకులు[మార్చు]