Jump to content

కేతిరెడ్డి పెద్దారెడ్డి

వికీపీడియా నుండి
కేతిరెడ్డి పెద్దారెడ్డి
కేతిరెడ్డి పెద్దారెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం తాడిపత్రి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 01 జూన్ 1965
తిమ్మంపల్లి గ్రామం
యల్లనూరు మండలం
అనంతపురం జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ
తల్లిదండ్రులు కేతిరెడ్డి రామిరెడ్డి, చిన్ననాగమ్మ
జీవిత భాగస్వామి రమాదేవి
సంతానం హర్షవర్దన్‌ రెడ్డి, సాయిప్రతాప్‌ రెడ్డి

కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం, చింతకాయమంద పంచాయతీ పరిధిలోని తిమ్మంపల్లి తిమ్మంపల్లి గ్రామంలో 1965 జూన్ 01లో కేతిరెడ్డి రామిరెడ్డి, చిన్ననాగమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన గార్లదిన్నె లోని నిర్మల ఇంగ్లీష్ రెసిడెంటిల్ స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కేతిరెడ్డి పెద్దారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి యల్లనూరు ఎంపీపీగా పనిచేశాడు. ఆయన 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 2016 నుంచి తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా పనిచేసి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జె.సి. అస్మిత్ రెడ్డి పై 7511 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  3. Sakshi (2019). "Tadipatri Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.