Jump to content

కేశోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

వికీపీడియా నుండి

కేశోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Kesoram Industries Limited) కాటన్ మిల్స్ లిమిటెడ్ పేరుతో 1919 సంవత్సరంలో స్థాపించబడినది.  కలకత్తాలో నూలు జౌళి మిల్లుగా ప్రారంభమై, కేశోరామ్ రేయాన్ ఉత్పత్తిగా విస్తరించింది. దీని మొదటి రేయాన్ ప్లాంటు సంవత్సరానికి 4,635 మెట్రిక్ టన్నుల రేయాన్ నూలు ఉత్పత్తి సామర్థ్యంతో 1959 సంవత్సరంలో ప్రారంభించారు.

కేశోరామ్ సంస్థ టైర్లు, సిమెంట్ పరిశ్రమల్లో స్థాపనతో కంపెనీకి పెరుగుతున్న వ్యాపారాల పోర్ట్ ఫోలియోను ప్రతిబింబించడానికి, 1986 సంవత్సరంలో సంస్థ పేరు కేశోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా పేరుతొ కేశోరామ్  ట్రేడ్ మార్క్ వ్యాపారము అభివృద్ధి చెంది, సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా , బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్ అసోసియేషన్, సోసియేట్ డి లా బోర్స్ డి లక్సెంబర్గ్ వంటి నాలుగు గ్లోబల్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ల ద్వారా గుర్తించబడింది.[1]

కేశోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
రకంప్రైవేట్
పరిశ్రమపరిశ్రమ
స్థాపన1919; 106 సంవత్సరాల క్రితం (1919)
ప్రధాన కార్యాలయం,
కీలక వ్యక్తులు
ఉత్పత్తులుటైర్స్,సిమెంట్,నూలు
IncreaseRs. 4202.02 Crore (2019)
DecreaseRs. -363.32 Crore (2019)[2]

చరిత్ర

[మార్చు]

కేశోరామ్ సంస్థ 1919 సంవత్సరంలో కలకత్తాలో నూలు, జౌళి మిల్లుగా స్థాపించబడింది, తర్వాత కంపెనీ వస్త్రాలు, రేయాన్ నూలు, సిమెంట్,పైపుల, టైర్ల వంటి పరిశ్రమలలో తన ఉత్పత్తులతో కేశోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బ్రాండ్ల పేరుతొ తన ఉత్పత్తులను మార్కెట్ లో అమ్మకాలను చేస్తుంది.[3]

కేశోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ఉత్పత్తులను టైర్లు, సిమెంట్,రేయాన్, పారదర్శక కాగితం, ఫిలమెంట్ నూలు ఉత్పత్తులను చేస్తుంది. కేశోరామ్ రేయాన్, బిర్లా శక్తి , బిర్లా టైర్స్ అనే బ్రాండ్ పేర్లతో కంపెనీ మార్కెట్ లో అమ్మకాలను చేస్తుంది. పశ్చిమ బెంగాల్, ఒడిషా, తెలంగాణ, కర్ణాటక, తెలంగాణ, కర్ణాటకలో ఉన్న ప్లాంట్ల  ద్వారా ఉత్పత్తి చేసి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ, చత్తీస్ గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో  ఉత్పత్తులను పంపిణీ చేస్తుంది.[4]

ప్లాంట్లు

[మార్చు]

కేశోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (కెఇఎల్) టైర్లు, సిమెంట్, రేయాన్ తో సహా వైవిధ్యభరితమైన వ్యాపారాన్ని కలిగి ఉంది. ఒడిశాలోని బాలాసోర్ ("బాలాసోర్ టైర్ ప్లాంట్") , ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ ("లక్సర్ టైర్ ప్లాంట్") వద్ద ఉన్న రెండు ఇంటిగ్రేటెడ్ టైర్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. కర్ణాటకలోని సేడం దగ్గర వాసవదత్త సిమెంట్ ప్లాంట్,[5] తెలంగాణ లోని బసంత్ నగర్ దగ్గర కేశోరామ్ సిమెంట్ ప్లాంట్,[6] రెండుసిమెంట్ తయారీ పరిశ్రమలు ఉన్నాయి.[7]

గుర్తింపు

[మార్చు]

కేశోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (కెఇఎల్) వినియోగ దారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తమ టైర్ల ఉత్పత్తులను అశోక్ లేలాండ్ టాటా మోటార్స్ VE కమర్షియల్ వెహికల్స్, వోల్వో వంటి కొత్త వాహనాలకు అనుగుణంగా కంపెనీని ఆధునీకరించారు. ఎగుమతి మార్కెట్ లకు సరఫరా చేయడంలో సమర్థత,విజయానికి కంపెనీ గుర్తింపు పొందింది. బంగ్లాదేశ్ ఫిలిప్పీన్స్ శ్రీలంక, వియత్నాంతో సహా 20కి పైగా దేశాలకు, ఆఫ్రికా ఆసియా మధ్య ప్రాచ్యం, దక్షిణ అమెరికా అంతటా అనేక ఇతర దేశాలకు ఈ కంపెనీ ఎగుమతి చేస్తుంది, బస్,ట్రక్ టైర్ల ఉత్పత్తిలో 15% వరకు ఎగుమతి చేయబడుతుంది. కేశోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ CAPEXIL స్పెషల్ ఎక్స్ పోర్ట్ అవార్డులను పొందింది, ఆటోమొబైల్ టైర్స్ ట్యూబ్ లు, ఫ్లాప్ లకు సంబంధించి ఎగుమతి సాధించినందుకు భారత ప్రభుత్వంచే గుర్తించబడింది. ప్రపంచ మార్కెట్ ల నిర్ధిష్ట ఆవశ్యకతల కొరకు కంపెనీ కొత్త ప్రొడక్ట్ లను అభివృద్ధి చేస్తుంది.[8]

మూలాలు

[మార్చు]
  1. "About - Kesoram". www.kesocorp.com. Retrieved 2022-10-11.
  2. "Kesoram financials".
  3. "Kesoram Industries > Company History > Diversified > Company History of Kesoram Industries - BSE: 502937, NSE: KESORAMIND". www.moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-11.
  4. "Kesoram Industries Ltd Company Profile - Overview". www.linkedin.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-11.
  5. "Vasavadatta Cement to enhance capacity". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). 2011-05-08. Retrieved 2022-10-11.
  6. "Latest Kesoram industries ltd information at www.indiainfoline.com". www.indiainfoline.comcompany (in ఇంగ్లీష్). Retrieved 2022-10-11.[permanent dead link]
  7. "Kesoram Industries Ltd. Company Profile - India | Financials & Key Executives | EMIS". www.emis.com. Retrieved 2022-10-11.
  8. "Kesoram Industries Ltd". Business Standard India. Retrieved 2022-10-11.