కైలాస దర్శనం (బ్రహ్మమానస సరోవరయాత్ర)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కైలాస దర్శనం
బ్రహ్మమానస సరోవరయాత్ర
కృతికర్త: పి.వి.మనోహరరావు
అంకితం: రుక్మిణీదేవి (గ్రంథకర్త తల్లి)
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: యాత్రాచరిత్ర
విభాగం (కళా ప్రక్రియ): సాహిత్యం
ప్రచురణ: పి.వి.మనోహరరావు
హనుమకొండ
విడుదల: 1986
పేజీలు: 606


కైలాస దర్శనం పి.వి.మనోహరరావు రచించిన యత్రాచరిత్రాత్మక పుస్తకం[1]. దీనిలో రచయిత తాను 29 రోజులలో చేసిన మానస సరోవర యాత్రను చూసినది చూసినట్లుగా వర్ణించాడు.[2] ఆయా స్థలాలకు సంబంధించిన రంగురంగు చిత్రాలతో ఈ పుస్తకం చదివిన వారికి ఈ యాత్ర చేయాలనే కోరికను కలిగిస్తుంది. ఈ గ్రంథంలో రచయిత సనాతన గ్రంథాలనుండి ఆవశ్యక విషయాలను ప్రమాణసూత్రాలుగా ఎత్తిచూపి ఈ గ్రంథానికి ఆధ్యాత్మిక గ్రంథంగా మలిచాడు.

విశేషాలు

[మార్చు]

ఈ గ్రంథానికి రచయిత "వినతి", రచయిత సోదరుడు పి.వి.నరసింహారావు (అప్పటి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి) "తొలిపలుకు", శృంగేరీ శారదాపీఠము జగద్గురు శంకరాచార్య "ఆశీస్సులు", కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖర సరస్వతి "ఆశీస్సు", కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి త్రివిక్రమ రామానంద భారతీస్వామి "ఆశీస్సు - అభిప్రాయము", పాములపర్తి సదాశివరావు "పరిచయ వాక్యములు", సి.నారాయణరెడ్డి, కోవెల సుప్రసన్నాచార్యల "అభినందన", ఎస్.లక్ష్మణమూర్తి "అభిప్రాయము" అందించారు. ఈ బృహద్గ్రంథాన్ని రచయిత తన మాతృమూర్తి కీ.శే.రుక్మిణీదేవి గారికి అంకితం ఇచ్చాడు.

విషయానుక్రమణిక

[మార్చు]

ఈ గ్రంథంలో 45 అధ్యాయాలున్నాయి. అవి వరుసగా

  1. హస్తినాపురి, చంద్రలోక భవనము
  2. హన్మకొండ నుండి హస్తినాపురికి అచట నాలుగు దినములు
  3. చంద్రవంశీయుల పురాతన రాజధానికి
  4. ధార్చులాకు ప్రయాణము
  5. పర్వతారోహణ ఆరంభము
  6. నారాయణాశ్రమ దర్శనము
  7. రుంగ్లింగ్ టాప్ ద్వారా జిప్తి
  8. సుందర నిజంగ్ జలపాతము ద్వారా మాల్పా
  9. మనోహరబుద్ధి క్యాంప్
  10. దారిలోగల దర్శనీయ స్థలములు
  11. ఛయలేక్ టాప్ ద్వారా గుంజి
  12. కాళిమాత దర్శనార్థము
  13. భయంకరలోయ నభిడాంగ్
  14. మన వేదములు, హిమాలయములు, పుణ్యక్షేత్రములు
  15. దూదిలాంటి తెల్లని మెత్తని మంచులో
  16. చైనా ప్రవేశము యాత్రీకుని దుర్మరణము
  17. తక్లాకోట్‌లో
  18. టిబెటు దేశ చరిత్ర
  19. కైలాస మానస దర్శనము
  20. మానస సరోవర మొదటి రోజు పరిక్రమ
  21. మానస సరోవర రెండవ రోజు పరిక్రమ
  22. మానస సరోవర పురాణ గాథ, విశేషములు
  23. దార్చెన్ విడిదికి
  24. మొదటి రోజు కైలాస పరిక్రమ
  25. రెండవ రోజు కైలాస పరిక్రమ
  26. కైలాస పురాణ గాథ, విశేషములు
  27. బౌద్ధ మతము
  28. టిబెటు వేదాంతము
  29. టిబెటు ప్రభుత్వము
  30. టిబెటు మతము, పాఠశాలలు
  31. ప్రశాంతముగా దార్చెన్‌లో
  32. తక్లాకోట్ తిరుగు ప్రయాణము
  33. తక్లాకోట్‌లో విశ్రాంతి
  34. జన్మభూమికి తిరుగు ప్రయాణము
  35. కాలాపానీ నుండి గుంజి
  36. గుంజి నుండి బుద్ధికి
  37. బుద్ధి నుండి మాల్పాకు
  38. మాల్పా నుండి జిప్తి
  39. సిర్ఖా ప్రయాణము
  40. ధార్చులా ప్రయాణము
  41. పురాణకాలము నుండి పురోగమన కాలము వరకు
  42. మన దేశము నుండి కైలాస మానసమునకు గల దారులు
  43. బస్సులో చంపావతి ప్రయాణము
  44. ఢిల్లీలో, పిల్లలతో
  45. తీర్థములు వాని ప్రాశస్త్యము

ఈ గ్రంథం చివర అనుబంధంగా

  1. హిమాలయము - మానస సరోవరము  : భాష్యం విజయసారథి
  2. కావ్యాలలో హిమాలయ సౌందర్యము : కోవెల సుప్రసన్నాచార్య
  3. వివిధ పురాణాలలో కైలాస మానస తీర్థ ప్రశంస : అత్తలూరి మృత్యుంజయశర్మ
  4. శాక్తాది సంప్రదాయము - ఒక పరిశీలన :శాస్త్రుల భార్గవరామశర్మ
  5. సృష్టి క్రమము : అత్తలూరి మృత్యుంజయశర్మ
  6. హైందవారాధనా విధులలో ముద్రల ప్రాధాన్యత : కోవెల సుప్రసన్నాచార్య

అనే 6 వ్యాసాలను చేర్చారు.

మూలాలు

[మార్చు]
  1. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కైలాస దర్శనం పుస్తకప్రతి
  2. యామిజాల, పద్మనాభస్వామి (1 January 1988). "గ్రంథ విమర్శలు - కైలాస దర్శనం" (PDF). భారతి. 65 (1): 62. Archived from the original (PDF) on 11 నవంబరు 2022. Retrieved 24 February 2017.