కొంగవాలు కత్తి (నవల)
కొంగవాలు కత్తి | |
కృతికర్త: | గడ్డం మోహన్‌రావు |
---|---|
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నవల |
ప్రచురణ: | |
విడుదల: | 2018 |
కొంగవాలు కత్తి చిందు కళాకారుల జీవితాలను సజీవంగా చిత్రించిన నవల.[1]కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని పొందిన ఈ నవలను ఉస్మానియా యూనివర్సిటీ కోఠి మహిళా కళాశాల లెక్చరర్ డా. గడ్డం మోహన్‌రావు రచించారు. త్రిమూర్తుల పెళ్లి కోసం విశ్వకర్మ ఆదిజాంబవంతునికి ఇచ్చిన కత్తే కొంగవాలు కత్తి. మోహనరావు ఈ నవలను 45 రోజులలో రాశారు. ఈ నవల పూర్తిగా చిందు కళాకారుల జీవితాలు, చిందు భాగవతం నేపథ్యంలోనే సాగుతుంది. చిందు కళాకారుల ఇంటిలో జన్మించిన మోహనరావు కుల వివక్షతో పాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత విద్యావంతుడిగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అత్యున్నత డాక్టరేట్ డీగ్రీని అందుకున్న తొలి చిందు విద్యార్ధిగా రికార్డును సృషించారు. ఆ అనుభవాలతోనే ఆయన ఈ కొంగవాలు కత్తి నవలను రశారు. పీహెచ్‌డీ చేస్తున్నప్పుడే 2013లో చిందు ఎల్లమ్మ కళాజీవితం నేపథ్యంలో ‘చిందు ఎల్లమ్మ’, చిందు కళారత్న గడ్డం సమ్మయ్య జీవిత విశేషాలతో ‘చిందుల హంస’ రాశారు మోహన్‌రావు. [2]
రచన పై అభిప్రాయాలు
[మార్చు]'కొంగవాలు కత్తి' నవలలో చిందు భాగవతం స్ఫూర్తి ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి తెలిపారు. తెలంగాణకు, చిందు కళకు ఉన్న సాహిత్యాన్ని ఈ నవల తెలియచేస్తున్నదని, తెలంగాణ మట్టివాసనను తనువునిండా నింపుకున్న ఈ కొంగవాలు కత్తి, తెలంగాణ భాషా సోయగాలతో వికసించిందన్నారు. చిందు కళాకారుల ఇతివృత్తంగా నడిచే ‘కొంగవాలుకత్తి’ నవలలో అడుగడుగునా విభిన్న సాంస్కృతికాంశాలు పలకరిస్తాయని, ఆశ్రిత ఉపకులాలైన చిందు, డక్కలి, బైండ్ల, మోచి లాంటి వారు అంతకు మించిన వివక్షను ఎదుర్కొంటున్న తీరును పట్టిచూపిన ఆత్మవిమర్శనాత్మక మొదటి నవల ఈ కొంగవాలు కత్తి అని పలువురు విమర్శకులు అభిప్రాయపడ్డారు.
పాత్రలు, రచనాశైలి
[మార్చు]చిందు కళకు మూలస్తంభంగా నిలిచే చిందు ఎల్లమ్మ, చిందు సాహితీవేత్త గడ్డం మచ్చయ్యదాసులు ఇందులో పాత్రలు. ఉత్కంఠభరిత కథనం, ఔచిత్యవంతమైన నాటకీయత, సజీవ పాత్ర చిత్రణం, సహజమైన పాత్రోచిత సంభాషణా నైపుణ్యం, మాండలిక సౌందర్యం లాంటివి రచయిత శిల్పంలోని ప్రత్యేకతలు. 'కొంగవాలు కత్తి' నవలలో నాయకుడు నర్సింగరావు. ఆ నర్సింగరావు ఎవరో కాదు... మోహన్‌రావే! అని దండోరనేస్తం పత్రికకు రాసిన వ్యాసంలో తెలిదేవర తెలిపారు. [3]
పురస్కారాలు
[మార్చు]ఈ నవలకు ఈ క్రింది పురస్కారాలు లభించాయి.
- నవతెలంగాణ పురస్కారం
- విశాల సాహిత్య అకాడమీ పురస్కారం
- అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ పురస్కారం
- కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ shivakumar (2019-09-15). "Story about Kongavalu Kathi Novel Book". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-05-17. Retrieved 2021-05-17.
- ↑ "తెలుగు వెలుగు మాసపత్రికలో వ్యాసం". Archived from the original on 2021-05-07. Retrieved 2021-05-07.
- ↑ "దండోరనేస్తం పత్రిలో వ్యాసం". Archived from the original on 2021-05-07. Retrieved 2021-05-07.
యితర లింకులు
[మార్చు]- దండోరనేస్తంలో వ్యాసం Archived 2021-05-07 at the Wayback Machine
- తెలుగువెలుగులో వ్యాసం Archived 2021-05-07 at the Wayback Machine
- నవతెలంగాణలో వ్యాసం
- ఆంధ్రజ్యోతిలో వ్యాసం