గడ్డం సమ్మయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గడ్డం సమ్మయ్య
జననం(1958-01-05)1958 జనవరి 5
జాతీయతభారతీయుడు
వృత్తిచిందు యక్షగాన కళాకారుడు
జీవిత భాగస్వామిశ్రీరంజని
పిల్లలుముగ్గురు కుమారుడు (సోమరాజు, హిమగిరి, మురళీకృష్ణ)
తల్లిదండ్రులుచిందుల రామస్వామి -

గడ్డం సమ్మయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు. వారసత్వంగా వచ్చిన చిందు యక్షగానాన్ని నమ్ముకొని అనేక ప్రదర్శనలు ఇచ్చిన సమ్మయ్య, 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి జానపద కళలు విభాగంలో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[1][2] మారుతున్న కాలానికి అనుగుణంగా తనదైన శైలీలో ప్రదర్శనలిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో కళారత్న అవార్డును అందుకున్న సమ్మయ్య జీవిత విశేషాలతో గడ్డం మోహన్‌రావు 2013లో ‘చిందుల హంస’ అనే పుస్తకాన్ని రాశాడు.[3]

2024, జనవరి 25న భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

సమ్మయ్య 1958, జనవరి 5న చిందుల రామస్వామి - ఛండికాంబ దంపతులకు తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, అప్పిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు. సమ్మయ్యకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. సంచార జీవితం గడుపుతున్న సమ్మయ్య కుటుంబం అప్పిరెడ్డిపల్లిలో స్థిరపడింది. దాంతో ఆ గ్రామంలోనే సమ్మయ్య ఆరవ తరగతి వరకు చదువుకున్నాడు.[4]

దుర్యోధనుడి పాత్రలో గడ్డం సమ్మయ్య
గౌ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2024 ఏప్రిల్ 22న పద్మశ్రీ పురస్కారం అందుకుంటూ

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సమ్మయ్యకు 1983లో శ్రీరంజనితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు సోమరాజు చిందు కళా ప్రదర్శనలు ఇస్తున్నాడు. రెండవ కుమారుడు వృత్తి విద్యా (ఇంజనీరింగ్) పూర్తిచేసి మల్టీనేషనల్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడవ కుమారుడు ఫోటోగ్రఫీలో బిఎఫ్ఏ పూర్తిచేసాడు.

కళారంగం

[మార్చు]

16 ఏళ్ళ వయసులో తన తండ్రి ప్రోత్సాహంతో చిన్ని కృష్ణుడి వేషధారణతో కళారంగంలోకి అడుగుపెట్టాడు. 1985లో జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో కీచకవధ ప్రదర్శనలో కీచకుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత 1988లో నెహ్రూ యువకేంద్రం ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం ప్రాంభించి, అనేక ప్రదర్శనల్లో లోహితాన్యుడు, సిరియాళుడు, బాలవద్ధి, సత్య హరిశ్చంద్రుడు, కీచకుడు, కంసుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణుడు వంటి పాత్రలు పోషించాడు.

తొమ్మిదిమంది బృందంతో[5] రాష్ట్ర, జాతీయస్థాయి వేదికలతోపాటు 1991లో ఆలిండియా రేడియోలో 80 ప్రదర్శనలు, దూరదర్శనిలో 30 ప్రదర్శనలు, యువజన సాంస్కృతిక పర్యాటల శాఖల ఆధ్వర్యంలో దాదాపు నాలుగువేల ప్రదర్శనలు ఇచ్చాడు. 1991లో కళాకారుల సంఘంను ప్రారంభించాడు. ప్రభుత్వం తరపున అనేక సామాజిక కార్యక్రమాలు, అవగాహన అంశాలపై వేల ప్రదర్శనలు ఇచ్చాడు.[6]

గడ్డం సమ్మయ్య తన బృందంతో

పురస్కారాలు

[మార్చు]
  1. 1985లో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి తూమాటి దోణప్పచే సన్మానం
  2. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం[7]
  3. 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ చేతులమీదుగా కళారత్న (హంస) పురస్కారం, రూ. 5వేల నగదు స్వీకరణ[8]
  4. 2001లో నల్గొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఉత్సవాలలో ఆచార్య భక్తవత్సలం రెడ్డిచే సన్మానం
  5. 2003లో హైదరాబాదులోని శిల్పారామంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా విశిష్ట పురస్కారం[9]
  6. 2009లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి బంగారు కంకణం ప్రదానం
  7. 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి కెసీఆర్ చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం[10]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, తెలంగాణ (31 May 2017). "ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు". Sakshi. Archived from the original on 6 August 2017. Retrieved 27 September 2021.
  2. Andhrajyothy (1 June 2017). "52 మందికి ప్రభుత్వ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 31 May 2021. Retrieved 27 September 2021.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (8 July 2018). "నా అక్షరాలు సజీవ శిలాజాలు, గబ్బిలాల ప్రతిధ్వనులు.". andhrajyothy. గడ్డం మోహన్‌రావు. Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  4. చిందుల హంస, జిందగీ, నమస్తే తెలంగాణ, వరంగల్, 2014 మార్చి 26, మధు కోట.
  5. అదండీ... గడ్డం సమ్మయ్య ప్రత్యేకత!, ఈనాడు వరంగల్, 2006 నవంబరు 18.
  6. చిందు కళాకారుడికి దక్కిన గౌరవం, ఆంధ్రజ్యోతి, జనగామ జిల్లా, 2017 జూన్ 1.
  7. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 9 సెప్టెంబరు 2017. Retrieved 27 సెప్టెంబరు 2021.
  8. చిందు కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాక్షి, జనగామ జిల్లా, 2017 జూన్ 1.
  9. ఆయన చిందు భలే కనువిందు, ఆంధ్రజ్యోతి, వరంగల్ జిల్లా, 2010 నవంబరు 21.
  10. సమయం తెలుగు, తెలంగాణ (31 May 2017). "తెలంగాణ ప్రభుత్వం-2017 అవార్డులు". Samayam Telugu. Archived from the original on 12 October 2017. Retrieved 27 September 2021.