కొండపల్లి రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండపల్లి రాజా
Kondapalli Raja.jpg
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
నటవర్గంవెంకటేష్,
సుమన్,
నగ్మా
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1993
భాషతెలుగు

కొండపల్లి రాజా 1993లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, నగ్మా, సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో రజినీకాంత్ కథానాయకుడిగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అన్నామలై ఈ చిత్రానికి మాతృక.

కథ[మార్చు]

రాజా తన తల్లితో పాటు ఆవులను పెంచుకుంటూ పాలు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. రాజా, ధనవంతుడు గంగాధరం కొడుకైన అశోక్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అశోక్ చిన్నప్పుడే తల్లిని కోల్పోవడం వల్ల రాజా తల్లినే తన తల్లిలాగా అభిమానిస్తుంటాడు. అశోక్ తన కంపెనీలో పనిచేసే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ గంగాధరానికి అది ఇష్టం ఉండదు. రాజానే వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్ళి జరిపిస్తాడు. రాజా కూడా లక్ష్మి అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. గంగాధరం రాజా మీద ద్వేషం పెంచుకుంటాడు. ఎలాగైనా తన కొడుకుని రాజా నుంచి దూరం చేయాలని పథకం వేస్తాడు. గంగాధరం చేసిన మోసం వల్ల రాజా తన తల్లి ప్రాణంగా చూసుకున్న ఇల్లు పోగొట్టుకుంటాడు. జరిగిన దాంట్లో అశోక్ పాత్ర కూడా ఉందని రాజా వాళ్ళింటికి వెళ్ళి అతని మీదే చాలెంజ్ చేస్తాడు. ప్రాణస్నేహితులిద్దరూ విడిపోతారు. అంతకు మునుపు ఒకసారి రాజా ప్రవర్తనకు అభిమానియైన మంత్రి సింహాద్రి అప్పన్న సహాయంతో బ్యాంకు లోను తీసుకుని డైరీ వ్యాపారం ప్రారంభించి మళ్ళీ కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో అశోక్ ని ఓడించి అధ్యక్ష పదవి సంపాదిస్తాడు.

రాజా చెల్లెలు అశోక్ తమ్ముడు శ్రీకాంత్ తో ప్రేమలో పడుతుంది. కానీ రాజా మాత్రం అశోక్ తో మాట్లాడటానికి ఇష్టపడడు. కానీ శ్రీకాంత్ తన పట్టు విడవకుండా తన ప్రేమ నిరూపించి రాజాని ఒప్పిస్తాడు. రాజా వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపిస్తాడు. పెళ్ళైనా తర్వాత శ్రీకాంత్ తన నిజస్వరూపం బయటపెడతాడు. రాజా చెల్లెల్ని అన్ని రకాలుగా వేధిస్తుంటాడు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలున్నాయి. ఈ చిత్రంలోని పాటలన్నింటికీ ఎం. ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చాడు.[1]

  • కొండపల్లి రాజా గుండె చూడరా
  • అమ్మమ్మమ్మమ్మా
  • ఈ కాశిలో సిగ్గు
  • దానిమ్మ తోటలోకి చెప్పవే
  • సింగరాయ కొండ కాడా
  • గవ్వం గుడుగుడు

మూలాలు[మార్చు]

  1. "naasongs.com లో కొండపల్లి రాజా పాటలు". naasongs.com. Archived from the original on 2 డిసెంబర్ 2016. Retrieved 27 September 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)