కొండబాల కోటేశ్వరరావు
| కొండబాల కోటేశ్వరరావు | |||
| పదవీ కాలం 2017 – 2023 డిసెంబర్ 9 | |||
ఎమ్మెల్యే | |||
| పదవీ కాలం 1999 – 2004 | |||
| ముందు | కట్టా వెంకటనర్సయ్య | ||
|---|---|---|---|
| తరువాత | కట్టా వెంకటనర్సయ్య | ||
| నియోజకవర్గం | మధిర నియోజకవర్గం | ||
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ | |||
| పదవీ కాలం 1992 – 1995 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1948 డిసెంబర్ 7 కొండ కొడిమ గ్రామం, వైరా మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
| తల్లిదండ్రులు | రామయ్య | ||
| జీవిత భాగస్వామి | రాజేశ్వరి | ||
| సంతానం | 1 కుమారుడు, 2 కుమార్తెలు | ||
| నివాసం | హైదరాబాద్ | ||
కొండబాల కోటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999లో మధిర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] కొండబాల కోటేశ్వరరావు
రాజకీయ జీవితం
[మార్చు]కొండబాల కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి కొండ కొడిమ గ్రామా సర్పంచ్‌గా పని చేసిన తరువాత 1992 నుంచి 1995 వరకు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా పని చేశాడు.[2] ఆయన 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున మధిర నియోజకవర్గం నుండి పోటీ చేసి 5001 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. కొండబాల కోటేశ్వరరావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో టీడీపీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2017లో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితుడై[3], 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 2023 డిసెంబర్ 9న తన పదవికి రాజానామా చేశాడు.[4]
కొండబాల కోటేశ్వరరావు 2025 జులై 4న బీఆర్ఎస్ పార్టీని వీడి గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (14 April 2014). "పోరుగడ్డ మధిర". the original నుండి 18 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 April 2022.
- ↑ Andhra Jyothy (23 December 2020). "సహకార." (in ఇంగ్లీష్). the original నుండి 18 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 April 2022.
- ↑ The Hans India (2 March 2017). "Khammam leads the pack" (in ఇంగ్లీష్). the original నుండి 22 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 April 2022.
- ↑ "రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి 'కొండబాల' రాజీనామా". Andhrajyothy. 9 December 2023. the original నుండి 5 August 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 August 2025.
- ↑ "కాంగ్రెస్‌లోకి మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు". Eenadu. 5 August 2025. the original నుండి 5 August 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 August 2025.
- ↑ "BRS leader and former MLA joins Congress" (in Indian English). The Hindu. 4 August 2025. the original నుండి 5 August 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 August 2025.