Jump to content

ప్రదీప్ (నటుడు)

వికీపీడియా నుండి
(కొండిపర్థి ప్రదీప్ నుండి దారిమార్పు చెందింది)
ప్రదీప్
జననం
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1981 - ప్రస్తుతం

హాస్యచిత్రాల దర్శకుడు జంధ్యాల వెండితెరకు పరిచయం చేసిన నటులలో కొండిపర్తి ప్రదీప్ ఒకడు.[1] 15కి పైగా నంది అవార్డులు అందుకున్నాడు.[2] జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం ఇతని మొదటి సినిమా.[3] తరువాత కొన్ని సినిమాలలోనే నటించాడు. తరువాత టెలివిజన్ రంగంవైపు మొగ్గు చూపి అనేక సీరియళ్లలో, టెలీ ఫిలింలలో నటించి, దర్శకత్వం వహించాడు. అనేక సీరియళ్లను నిర్మించాడు. రంగస్థల కళాకారుడు విన్నకోట రామన్న పంతులు ఇతని తాత.

జీవిత విశేషాలు

[మార్చు]

ప్రదీప్ విజయవాడలో పుట్టి పెరిగాడు. నటనలో ఓనమాలు దిద్దుకున్నది కూడా అక్కడే.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం. శీర్షిక పాత్ర Ref.
1981 ముద్ద మందారం (సినిమా)
1982 నాలుగు స్తంభాలాట (సినిమా) ప్రదీప్ కుమార్ [4]
1983 రెండుజెళ్ళ సీత కృష్ణుడు
2006 గోపి-గోదా మీదా పిల్లి సుదీప్
2008 ప్రేమాభిషేకం (2008 సినిమా) శ్రీదేవి తండ్రి
2019 F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ గోవిందరాజు
2022 ఎఫ్ 3 హారిక హనీ తండ్రి
2023 భోళా శంకర్ (సినిమా) వంశీ మామగారు

సీరియళ్ళు

[మార్చు]

జంధ్యాలతో పని చేస్తున్నపుడు స్క్రీన్ ప్లే లో ఆసక్తి కలిగింది. ఆ శిక్షణతో ప్రదీప్ కొన్ని సీరియళ్ళకు దర్శకత్వం వహించాడు. ప్రదీప్ దర్శకత్వం వహించిన మట్టి మనిషి సీరియల్ లో అక్కినేని నాగేశ్వరరావు నటించాడు.[2]

  • బుచ్చిబాబు
  • పెళ్ళి చూపులు
  • చాణక్య
  • మట్టి మనిషి
  • మందాకిని
  • ముద్దు బిడ్డ
  • మంచి మనసులు
  • ఏది నిజం
  • మమతల కోవెల
  • అనగనగ సోభు[5]
  • పెళ్ళి పందిరి
  • సాధన
  • ఆనందో బ్రహ్మ

మూలాలు

[మార్చు]
  1. వెబ్, మాస్టర్. "జంధ్యాల గారి సినిమా ముద్దమందారం హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల". జంధ్యావందనం. Archived from the original on 2016-10-24. Retrieved 2016-08-29.
  2. 2.0 2.1 "తెలుగు సినిమాల్లో ఆత్మలోపిస్తోంది". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 30 August 2016.
  3. "32 Years in Industry... Pradeep". mirchi9.com. Archived from the original on 11 ఆగస్టు 2014. Retrieved 30 August 2016.
  4. "Nalugu Stambhalata (1982)". Telugucinema.com. 7 February 2016. Archived from the original on 12 February 2016. Retrieved 17 September 2016.
  5. Pulagam, Chinnarayana (April 2005). Jandhya marutham (I ed.). Hyderabad: Haasam Publications. pp. 46–52.

బయటి లింకులు

[మార్చు]