Jump to content

కొండ చీపురు గడ్డి

వికీపీడియా నుండి

కొండ చీపురు గడ్డి
పుష్పాలతో కొండ చీపురు గడ్డి మొక్క
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
T. maxima
Binomial name
Thysanolaena maxima

కొండ చీపురు గడ్డి వృక్ష శాస్త్రీయ నామం Thysanolaena maxima. నేపాలీ లో అమ్లిసో అంటారు. నేపాల్ ప్రాంతపు కొండలలో, భారతదేశం యొక్క ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో, భూటాన్ లో ఈ మొక్క కనుగొనబడింది. ఈ మొక్క యొక్క పుష్పాలు శుభ్రపరిచే సాధనంగా లేదా చీపురుగా ఉపయోగిస్తున్నారు, దీనిని నేపాలీలో కుచో అంటారు. దీనిని ఇంగ్లీష్ లో అమెరికన్ గడ్డి, పులి గడ్డి, హిందీ లో నక్తురా, నాస్తురా, చీపురుగడ్డి, కన్నడలో కొండా చీపురు గడ్డి ,తెలుగు లో చీపూర్, చీపురు, గడ్డి, కొండా, కొండసిపురు, సంస్కృతం లో జర్నా, జర్నాహ్వా  అని పిలుస్తారు. ఈ జాతి గడ్డి ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్, భారతదేశం, నేపాల్ , ఆగ్నేయాసియాలో 1800 మీటర్ల ఎత్తులో లో ఉంటుంది . భారతదేశంలో దాదాపుగా, తడి,నిటారుగా ఉన్న చెరువులు ,నీటి లోయల వెంట,నీడ వాలులలో కనిపిస్తుంది [1] [2] కొండ చీపురు గడ్డి వంటి వెదురు, ఇది 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది, పెద్ద సమూహాలను ఏర్పరుస్తుంది. ఆకులు 7 సెం.మీ వెడల్పు వరకు ఉంటాయి, పువ్వులు పెద్ద కొమ్మల సమూహాలలో సంభవిస్తాయి. పూల కాడలను కట్టి, చీపురులుగా ఉపయోగిస్తారు. ఈ గడ్డి భారతదేశం అంతటా 1800 మీటర్ల ఎత్తులో కనిపిస్తుంది. పూత సమయం మార్చి-జూన్ నెలలు [3]

ఉపయోగములు

చీపురు గడ్డి లేదా టైగర్ గడ్డి పోయేసీ కుటుంబానికి చెందిన ఎత్తైన శాశ్వత గడ్డి. ఈ మొక్కల పుష్పగుచ్ఛాలను గడ్డి చీపురు అని పిలిచే చీపురు తయారీకి ఉపయోగిస్తారు (ప్లాస్టిక్‌తో చేసిన చీపురు కూడా ఇప్పుడు లభిస్తుంది). గడ్డి చీపురు పర్యావరణ అనుకూలమైనవి. వీటితో చేసిన చీపుర్లు ఇంటిలో శుభ్రతకు వాడతారు . చీపురు తయారీతో పాటు ఈ మొక్క కాడలు కొండ వాలులలో నేల కోతను తగ్గించడానికి సహాయపడుతుంది. . మొక్క యొక్క ఆకుపచ్చ ఆకులు సన్నని కాలంలో పశువులకు పశుగ్రాసం గా ఉంటాయి. చీపురు గడ్డి కాండం గోడ నిర్మాణ వస్తువులుగా ఉపయోగిస్తారు. కాగితం పరిశ్రమలో కర్రలను ముడి పదార్థంగా వాడతారు. . ఈశాన్య భారతదేశంలో చీపురు ప్రాంతాలలో చీపురు గడ్డి అడవిగా పెరుగుతుంది, కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా భారతదేశంలో అత్యధికంగా గడ్డి చీపురు ఉత్పత్తి చేస్తుంది. చీపురు గడ్డిని విస్తృతమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితులలో పండించవచ్చు. నిటారుగా ఉన్న పర్వత ప్రాంతాలలో , బంకమట్టి నేలలు అనుకూలం . ఈ పంట కరువు పరిస్థితిని తట్టుకుంటుంది , అధిక వర్షపాతం కూడా అనుకూలమే ఈ పంటకు. కొండ ప్రాంతాలలో నీటి అవసరం లేదు. . విత్తనాల వ్యాప్తి ద్వారా కొత్త ప్రాంతాల సహజ విస్తరణ జరుగుతుంది.మొదటి సంవత్సరం పంటలో చీపురు దిగుబడి తక్కువగా ఉంటుంది తర్వాత 3 వ సంవత్సరం వరకు పెరుగుతూ ఉంటుంది, తదుపరి 4 లేదా 5 వ సంవత్సరములలో పంట తగ్గుతుంది. చీపురు గడ్డి మార్కెట్ ధర @ 45 / kg. మన దేశం లో కొండ ప్రాంతములైన మేఘాలయ, అస్సాం, సిక్కిం వంటి రాష్ట్రములలో ప్రజలు చీపురు గడ్డి ని మందుగా వాడతారు [4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Plant Details for a Thysanolaena maxima (ROXB.) KUNTZE". envis.frlht.org. Retrieved 2020-09-03.[permanent dead link]
  2. "Tiger grass - Encyclopedia of Life". eol.org. Retrieved 2020-09-03.
  3. "Thysanolaena latifolia - Tiger Grass". www.flowersofindia.net. Retrieved 2020-09-03.
  4. "Folk uses of some medicinal plants from North Sikkim" (PDF). nopr.niscair.res.in/. 2020-09-03. Retrieved 2020-09-03.{{cite web}}: CS1 maint: url-status (link)